BigTV English

Karisma Kapoor – Sanjay Kapur: నా మాజీ భర్త తన స్నేహితులతో శృంగారం చేయాలనీ వేధించాడు: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్!

Karisma Kapoor – Sanjay Kapur: నా మాజీ భర్త తన స్నేహితులతో శృంగారం చేయాలనీ వేధించాడు: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్!
Karisma Kapoor
Karisma Kapoor

Karisma Kapoor Ex Husband Sanjay Kapur Forced her to Sleep with his Friends: బాలీవుడ్‌లో ఎందరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారిలో చాలామంది హాయిగా తమ జీవితాలను లీడ్ చేస్తుండగా, కొందరు మాత్రం పెళ్లైన కొద్ది కాలానికే విడాకులు తీసుకుని ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.


అలా విడిపోయిన బాలీవుడ్ కపుల్స్‌లో సంజయ్ కపూర్, కరిష్మా కపూర్ ఒకరు. ప్రేమ ఖైదీ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన కరిష్మా, నాటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. సుమారు పదేళ్లపాటు హిట్ల మీద హిట్లు కొడుతూ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు చేరింది.

తన అందం, నటనతో ప్రేక్షకుల మెప్పును పొందిన కరిష్మా, తన కెరియర్ పీక్ లెవెల్‌లో ఉండగా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్‌తో ప్రేమలో పడింది. తొలినాళ్లలో సాఫీగా నడిచిన వీరి ప్రేమప్రయాణం కొన్నాళ్లకే అటకెక్కింది.


ఆ తర్వాత వాళ్లిందరు బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత అమితాబ్ బచ్చన్ ఇంటికి కోడలిగా వెళ్లే ఛాన్స్ వచ్చింది. అభిషేక్ బచ్చన్‌తో నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. కానీ, కొన్నాళ్లకే ఇరుకుటుంబాలు ఆ ఎంగేజ్‌మెంట్‌ను కేన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. ఇక అది జరిగిన కొద్ది రోజులకే పెద్దలు కుదిర్చిన పెళ్లికి సిద్ధపడి, 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌‌ను ఈ బ్యూటీ పెళ్లాడింది.

Also Read: వార్ 2 సినిమాకు డేట్లు కేటాయించిన ఎన్టీఆర్.. ఏకంగా అన్ని రోజులా..

దాదాపు 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత ఈ అమ్మడు.. భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఈ వార్త గొప్ప సంచలనంగా మారింది. అయితే ఇదే విషయంపై కరిష్మా కపూర్ చాలాసార్లు స్పందించింది. సంజయ్ వేధింపులు భరించలేకనే ఆయనకు విడాకులు  ఇవ్వాల్సి వచ్చిందని వాపోయింది.

అయితే  తాజాగా మరోసారి కరిష్మా తన మాజీ భర్త మీద సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లైన నాటి నుంచి సంజయ్ పెట్టిన చిత్ర హింసలకు తాను బాధితురాలిగా మారానని చెప్పుకొచ్చింది.

తనను, శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెట్టిన తన భర్త ప్రవర్తనలోని మరో వికృతమైన కోణాన్ని కూడా ఆమె బయటపెట్టింది. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం వెళ్లినప్పుడు సంజయ్, ఆ ప్రదేశానికి తన స్నేహితులనూ ఆహ్వానించాడని, వారందరి ముందు తనను నిలబెట్టి వేలం పాట పెట్టాడని చెప్పి వాపోయింది. వేలంపాటలో ఎక్కువ రేటుకు తనను దక్కించుకున్న వ్యక్తితో ఆ రాత్రి గడపాలని తనమీద ఒత్తిడి తీసుకొచ్చాడని చెప్పి బోరుమంది.

Also Read: అసభ్యకరంగా రష్మిక మరో డీప్‌ఫేక్ వీడియో.. తనకే ఎందుకు ఇలా జరుగుతోంది..

అయితే అలాంటి పనులకు తాను ఒప్పుకోనని ఆ సమయంలో తన భర్తకు తాను తెగేసి చెప్పినట్లు ఆమె వెల్లడించింది. అయితే, నాటి నుంచి ఆ సంఘటన తన జీవితంలో ఎన్నడూ మరచిపోలేని చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పెళ్లి తర్వాత కూడా సంజయ్ తన మొదటి భార్యతో సంబంధం నడిపాడని, సంజయ్ తల్లి కూడా తనను పలురకాలుగా ఇబ్బందుల పాలు చేసిందని చెప్పుకొచ్చింది.

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×