BigTV English

Ellyse Perry Creates History: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ

Ellyse Perry Creates History: చరిత్ర సృష్టించిన ఆర్సీబీ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ
Perry's all-round act confirms playoffs berth for RCB
Perry’s All-Round Act Confirms Playoffs Berth For RCB: ఉమన్ ఐపీఎల్ 2024 మ్యాచ్ లు దుమ్ము దుమారం రేపుతున్నాయి. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ అదరగొట్టింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే 6 వికెట్ల ఘనతను అందుకున్న తొలి బౌలర్‌గా  నిలిచింది. దీంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.

ఈ మ్యాచ్‌లో ఒక చిత్రం ఏమిటంటే ఆర్సీబీ బౌలర్  ఎలీస్ పెర్రీ  మొదట బౌలింగ్ కి వచ్చింది. మొదటి ఓవర్ లో వికెట్లు ఏమీ రాలేదు. రెండో ఓవర్ మూడో బంతి నుంచి మ్యాజిక్ స్టార్ట్ అయ్యింది. అలా తను వేసిన 4 ఓవర్లలో అంటే 24 బంతుల్లో మొదటి తొమ్మిది బందులు తీసివేయగా.. మిగిలిన 15 బంతుల్లో 6 వికెట్లు పడగొట్టింది. మొత్తమ్మీద 16 పరుగులు ఇచ్చింది. ఇందులో మరో విశేషం ఏమిటంటే  నాలుగు వికెట్లు అయితే క్లీన్ బౌల్డ్ ద్వారా వచ్చాయి.. మిగిలిన రెండు ఎల్బీగా వచ్చాయి.


ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై..  ఎలీస్ పెర్రీ  (6/15) ధాటికి 19 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. హీలీ మాథ్యూస్ (26), సజీవన్ సజన (30), ప్రియాంక బాలా (19 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Read More: రిషబ్ పంత్ రాక సంతోషదాయకం: సీనియర్లు


ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ మోలినెక్స్, ఆషా సోభనా, శ్రేయాంక పాటిల్ తలో వికెట్ తీశారు.

అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి రంగంలోకి దిగిన ఆర్సీబీ కూడా తడబడింది. కెప్టెన్ స్మృతి మంధాన(11), సోఫీ మోలినక్స్(9), సోఫీ డివైన్(4) విఫలమయ్యారు. దీంతో మళ్లీ ఎల్లిస్ పెర్రి ఆల్ రౌండర్ అవతారం ఎత్తింది. 38 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సుతో 40 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. జట్టుని విజయపథంలో నిలిపింది. తనకి మద్దతుగా రిచాఘోర్ 36 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, నాట్ సీవర్ బ్రంట్ తలో వికెట్ తీశారు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×