AP High Court: టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో.. వైసీపీ నేతలకు చుక్కెదురైంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.
వైసీపీ నేతలైన దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి తదితరులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. వాటన్నింటినీ ఏపీ హైకోర్టు తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేవరకూ.. తమను అరెస్ట్ చేయకుండా ఆదేశాలైనా ఇవ్వాలని వైసీపీ నేతల తరఫు న్యాయవాది కోర్టును కోరగా.. అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వవద్దని టీడీపీ తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అరెస్టుపై ఆదేశాలు ఇవ్వడంపై మధ్యాహ్నం తుది నిర్ణయం రానుంది.
Also Read: కృష్ణమ్మ నుంచి బెజవాడను రక్షించిన ఆ వాల్ ను కట్టింది చంద్రబాబేనా ? జగనా ? అసలు నిజం ఏంటి ?
మరోవైపు నేటి సీఎం, నాటి ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నివాసంపై దాడి జరిగిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు సైతం ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ముందస్తు బెయిల్ కోసం.. హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానిని కూడా కోర్టు తిరస్కరించింది.