BigTV English

Little Hearts: అనుష్క ‘ఘాటీ’కి పోటీగా చిన్న సినిమా.. వారం ముందుగానే థియేటర్లలోకి, కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే!

Little Hearts: అనుష్క ‘ఘాటీ’కి పోటీగా చిన్న సినిమా.. వారం ముందుగానే థియేటర్లలోకి, కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే!

Little Hearts Preponed: ప్రస్తుతం సినిమాలన్ని వాయిదా పడుతుంటే.. ఓ చిన్న సినిమా ప్రీపోన్‌ అయ్యింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద హీరోహీరోయిన్ల చిత్రాలు, పాన్‌ ఇండియా సినిమాలను కొనేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు. దీంతో పెద్ద చిత్రాలు విడుదలకు సమస్యలు తెలెత్తున్నాయి. ఓ మూవీ రిలీజ్ అవ్వలాంటే నిర్మాతలతో బయ్యర్లు డీల్‌ చేసుకుంటున్నారు. లేదంటే సినిమా కొనేందుకు ధైర్యం చేయడం లేదు. ఈ క్రమంలో పాన్‌ ఇండియా, భారీ బడ్జెట్‌ చిత్రాలన్ని వాయిదా పడుతున్నాయి. షూటింగ్‌ పూర్తయి ఎంతో కాలం అవుతున్న ఇప్పటికీ కొన్ని చిత్రాల రిలీజ్ డేట్‌ నోచుకోవడం లేదు.


అనుష్కకు చిన్న సినిమా పోటీ

ఇలాంటి పరిస్థితుల్లో ఓ చిన్న సినిమా ప్రీపోపోన్‌ అవ్వడం విశేషం. అదే ‘లిటిల్‌ హార్ట్స్‌’ చిత్రం. సెప్టెంబర్‌ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా సెప్టెంబర్‌ 5కి ప్రీపోన్‌ అయ్యింది. అది కూడా పెద్ద సినిమాకు పోటీగా రావడం గమనార్హం. అనుష్క శెట్టి ఘాటీ మూవీ కూడా సెప్టెంబర్‌ 5న విడుదల అవుతోంది. అదే డేట్‌కి చిన్న సినిమా లిటిల్‌ హార్ట్స్‌ రిలీజ్‌ చేయడానికి మూవీ టీం ముందుకు రావడం సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఈ మూవీని ప్రీపోన్డ్‌ చేస్తూ ఈ చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చింది. అనుష్క శెట్టి ఘాటీకి పోటీగా వస్తున్న ఈ చిత్రం ఎలాంటి టాక్‌ తెచ్చుకుంటుందనేది ఆసక్తిగా మారింది.


ఇప్పటికే ఈ చిత్రం వచ్చిన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌ మంచి స్పందన వచ్చింది. పూర్తి వినోదాత్మకంగా ఈ సినిమా సాగనుందని అర్థమైపోయింది. మరోవైపు అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్‌ జాగర్లమూడి రూపొందించిన ఘాటీపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి. మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్, ట్రైలర్‌ మూవీపై మంచి బజ్‌ పెంచాయి. ఇలాంటి టైంలో ఘాటీ లాంటి పెద్దగా లిటిల్‌ హార్ట్స్‌ లాంటి చిన్న సినిమా పోటీ ఇవ్వడం ఆసక్తిని సంతరించుకుంది. మరి ఘాటీ దాటిని లిటిల్‌ హార్ట్స్‌ తట్టుకుంటుందా? లేక కంటెంట్‌ బలంతో ఘాటీ వెనక్కి నెట్టి టాప్‌ నిలబడుతుందా? చూడాలి.

‘100% లవ్‌’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ కీలక పాత్రలో

కాగా సాయి మర్తాండ్‌ దర్శకత్వంలో యువ నటీనటులతో ఈ చిత్రం తెరకెక్కింది. 90’s ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్ (90’s A Middle Class Biopic) ఫేం మౌలీ, శివానీ నాగారం కీలక పాత్రల్లో నటించారు. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ‘నాట్‌ టచింగ్‌.. ఓన్లీ హార్ట్‌ టచింగ్‌’ అంటూ యువతను ఆకట్టునే అంశాలతో లిటిల్‌ హార్ట్స్‌ టీజర్‌ పూర్తి వినోదాత్మకంగా సాగింది. టీజర్‌తో మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ‘100% లవ్‌’ చైల్డ్‌ ఆర్టిస్ట్‌ నిఖిల్‌ అబ్బూరి ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం టీనేజ్‌ వయసుకు వచ్చిన నిఖిల్‌.. ఈ సినిమాతో నటుడిగా అలరించబోతున్నాడు.

Also Read: OTT Movie: ఒకే ఇంటికి దత్తతకు వెళ్లి.. అలాంటి పనులు చేసే జంట.. చివరికి ఊహించని ట్విస్ట్

Related News

Chiranjeevi : 2027 సంక్రాంతి బరిలో మళ్లీ చిరునే… కానీ, ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు

TVK Maanadu : విజయ్ పొలిటికల్ బోణి అదిరిపోయింది… ఏకంగా 86 లక్షల మంది

Coolie Collections : కూలీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.. అక్కడ ఛావా రికార్డు బ్రేక్..

Cine Workers Strike: ఈ వేతనాలు మాకోద్దు.. సినీ కార్మికులు అసంతృప్తి.. సోమవారం ఏం జరగబోతుంది?

Pawan Kalyan: ఓకే నెలలో 3 పవన్ కళ్యాణ్ సినిమాలు, ఓజీ ముందు అవసరమా? 

Big Stories

×