BigTV English

Cine Workers Strike: ఈ వేతనాలు మాకోద్దు.. సినీ కార్మికులు అసంతృప్తి.. సోమవారం ఏం జరగబోతుంది?

Cine Workers Strike: ఈ వేతనాలు మాకోద్దు.. సినీ కార్మికులు అసంతృప్తి.. సోమవారం ఏం జరగబోతుంది?

Cine Workers Disappoint on Producer: తెలంగాణ ప్రభుత్వం చొరవతో సినీ కార్మికుల సమ్మెకు తెరపడింది. కార్మికుల వేతనాల పెంపుకు నిర్మాతలు గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. కార్మికుల వేతనాలను 22.5 శాతం పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో సమ్మెకు ఎండ్‌ కార్డు పడింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో సోమవారం నుంచి సినిమా షూటింగులు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే నిర్మాతలు పెంచిన వేతనాలపై సినీ కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. ఈ విషయమైన ఫెడరేషన్ సంఘాల నాయకులపై కార్మికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు పూర్తి వేతనాలు పెంచాల్సిందే అని డిమాండ్‌ చేస్తున్నారు.


సినీ కార్మికులు అసంతృప్తి

కాగా సంవత్సరానికి 10 శాతం చొప్పి మూడేళ్లకు 30 శాతం వేతనాలను పెంచాలన్ని సినీ కార్మికులు నిర్మాతలు కోరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండస్డ్రీ పరిస్థితి బాగా లేదని, నష్టాల్లో ఉందని.. ప్రస్తుతం వేతనాలు పెంచడం కుదరని నిర్మాతలు తెలిపారు. దీంతో ఫెడరేషన్‌ ఆధ్యర్యంలో ఉన్న 24 సినిమా విభాగాల కార్మికులు సమ్మెకు సైరన్‌ మోగించారు. ఎలాంటి ముందస్తు సమాచారం, ప్రకటన లేకుండానే ఫెడరేషన్‌ సమ్మెకు దిగింది. దీనిపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండ సమ్మెకి దిగడంతో సినీ కార్మిక సంఘాలపై మండిపడ్డారు. వారు ఏం చేసిన వేతనాలు పెంచేది లేదని నిర్మాతలు తేల్చేశారు. ఎన్నో చర్చలు, సమావేశాలు జరిగిన కార్మికులు అడిగినంత పెంచడం కుదరదని చెప్పేశారు.


అలా 18 రోజుల పాటు జరిగిన సినీ కార్మికుల సమ్మెకు తెలంగాణ ప్రభుత్వం చోరవతో సద్దుమనిగింది. ఈ సమస్య పరిష్కరానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్‌ ఛాంబర్‌ సభ్యులు, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, కార్మిక శాఖ రంగంలోకి దిగి నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ భేటీ నిర్మాతలు నిబంధనలతో కూడిన వేతనాల పెంపుకు మొగ్గు చూపించారు. వారు డిమాండ్‌ చేసినంత ఇవ్వకుండ కోతలు విధించారు. రోజుకు రూ. 2వేల లోపు వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం చొప్పున పెంచుతామని తెలిపారు. అలాగే రూ. 2 వేల నుంచి రూ. 5వేల మధ్య వేతనం ఉన్నవారికి మొదటి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం చొప్పున పెంచుతామని సమావేశంలో తెలిపారు.

Also Read: Little Hearts: లిటిల్‌ హార్ట్స్‌ ప్రీపోన్డ్‌.. వారం ముందుగానే థియేటర్లలోకి, కొత్త రిలీజ్ డేట్‌ ఎప్పుడంటే!

ఫెడరేషన్ ముట్టడికి రంగం..

అయితే ఇందులో నాలుగు విభాగాల్లోని కార్మికులు వేతనాలు పెంచనే లేదు. అయినా దీనికి ఫేడరేషన్‌ సభ్యులు, సినీ కార్మికులు సంఘాల నాయకులు అంగీకారం తెలపడంతో షూటింగ్‌ మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే దీనిపై సినీ కార్మికులు అసంతృప్తితో ఉన్నారట. ఒప్పందం ప్రకారం ఏడాదికి 10 శాతం చొప్పున 30 శాతం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంలో ఫెడరేషన్‌, సినీ సంఘాల నేతలపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్‌లకి వెళ్లిన వారిని తిరిగి రావాలని ఆదేశిస్తున్నారట. అంతేకాదు వివిధ విభాగాలకు చెందిన కార్మికులంత ఏకమై.. ఫెడరేషన్‌ని చుట్టుముట్టేందుకు రెడీ అవుతున్నాయట. కార్మికలంత.. ఆయా సంఘాల నేతలకు, ఫెడరేషన్‌కి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. సినీ కార్మికులు నిరసనతో మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్‌ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయట. మరి ఈ వివాదం పూర్తిగా ఎప్పుడు సద్దుమణుగుతుందో చూడాలి.

Related News

Kaithi 2: ఖైదీ 2 వాయిదా.. మరో డైరెక్టర్‌కి ఒకే చెప్పిన కార్తీ.. డిసెంబర్‌ నుంచి షూటింగ్‌!

Teja Sajja: ఆ ఇద్దరి స్టార్ హీరోలను టార్గెట్ చేసిన తేజ సజ్జా? దసరా బరిలో

Chiranjeevi : 2027 సంక్రాంతి బరిలో మళ్లీ చిరునే… కానీ, ఇప్పుడు ఆ పప్పులేం ఉడకవు

TVK Maanadu : విజయ్ పొలిటికల్ బోణి అదిరిపోయింది… ఏకంగా 86 లక్షల మంది

Coolie Collections : కూలీ బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే.. అక్కడ ఛావా రికార్డు బ్రేక్..

Big Stories

×