Octopus video: థ్యాంక్స్.. ఎవరైనా మనకు సాయం చేస్తే.. ఆపదలో ఉన్నప్పుడు ఆదకుంటే వెంటనే థ్యాంక్స్ అని చెబుతాం.. జీవితంలో మనం తరుచూ థ్యాంక్స్ అనే వర్డ్ ను ఉపయోగిస్తుంటాం. అయితే.. చనిపోయే స్థితిలో ఉన్న అక్టోపస్ ను ఓ మహిళా రక్షించింది. దీంతో అక్టోపస్ వారికి థ్యాంక్స్ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అక్టోపస్ థ్యాంక్ యూ చెప్పడం ఏంటి..? అసలు ఇది నిజమేనా..? ఇది ఎక్కడ జరిగింది..? అనే వివరాలను క్లియర్ కట్ గా తెలుసుకోవాలంటే ఈ స్టోరినీ చదివి తీరాల్సిందే..
Octopus are an extremely intelligent species…
I think he said thank you 😊 pic.twitter.com/Ym7fqiyfZv— Audra White 🦋❤️ (@AudieZaBeast) August 22, 2025
సౌతాఫ్రికా, కౌప్ టౌన్ నగరంలోని క్లీన్ బాయ్ బీచ్ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా తన ఇద్దరి కుమార్తెలతో కలిసి అలా సరదాగా క్లీన్ బాయ్ బీచ్ కు వెళ్లింది. అయితే.. బీచ్ లో నడుస్తుండగా.. వారి కంటికి అక్టోపస్ జీవి కనిపించింది. అది ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు వారు గుర్తించారు. ఒడ్డున కొన ఊపిరితో ఉన్న అక్టోపస్ ను వారు ఎలాగైనా రక్షించుకోవాలని అనుకున్నారు. వెంటనే వారు ఆ జీవిపై నీరు పోసి.. జాగ్రత్తగా సముద్రంలోకి విడిచిపెట్టారు. అది ప్రాణాలతో బయటపడింది.
అయితే అక్టోపస్ నీటిలోకి వెళ్లిన తర్వాత.. అది మహిళా చేతికి షేక్ హ్యాండ్స్ ఇస్తున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ మహిళ ఈ వీడియోను సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇక నెట్టంట్ తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూడడానికి చాలా అద్భుతంగా ఉండడంతో లక్షల మంది నెటిజన్లు లైక్స్, కామెంట్ చేస్తున్నారు.
ALSO READ: Indian Railway: ఇండియన్ రైల్వేలో 2865 పోస్టులు.. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసైతే చాలు.. ఇదే మంచి అవకాశం
నెటిజన్లు ఈ వీడియో కింద వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. అక్టోపస్ అత్యంత తెలివైన జీవి.. అది ఎంత ముద్దుగా థ్యాంక్స్ చెబుతోంది.. రియల్లీ ఇది గ్రేట్ వీడియో అని కామెంట్ చేశారు. మరో నెటిజన్.. ఇది చాలా అరుదైన వీడియో.. ఆ మహిళా చాలా అదృష్టవంతురాలు అని రాసుకొచ్చింది. తనును కాపాడినందుకు గానూ.. మహిళా మేలును మరిచిపోకుండా అక్టోపస్ థ్యాంక్స్ చెప్పిన విధానం నిజంగా సూపర్ అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
ALSO READ: Indian Navy Jobs: పదితో ఇండియన్ నేవీలో భారీగా జాబ్స్.. దరఖాస్తుకు చివరి తేది ఇదే
ఆక్టోపస్ జీవులు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయని.. అవి మనుషుల్లాగే భావోద్వేగాలను కలిగి ఉంటాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. ఈ వీడియో ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతోంది. వేల మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. జంతువులు, నీటి జీవుల పట్ల సహృదయంగా ఉండాలని ఈ వీడియో తెలియజేస్తోంది.