Indian Railways: పండుగల సీజన్ రాబోతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీకి అనుగుణంగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగించేలా తగిన చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదే సమయంలో దసరా, దీపావళి వేళ ప్రయాణీకుల అదనపు రద్దీని తగ్గించడానికి తూర్పు కోస్ట్ రైల్వే (ECoR) స్పెషల్ ట్రైన్స్ ను అనౌన్స్ చేసింది. విశాఖపట్నం నుంచి బెంగళూరుకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
పండుగ సీజన్ లో ప్రత్యేక రైళ్లు
⦿రైలు నెం.08581 వైజాగ్-SMV బెంగళూరు వీక్లీ స్పెషల్ సెప్టెంబర్ 14 నుంచి నవంబర్ 30 వరకు ఆదివారాల్లో నడవనుంది. మధ్యాహ్నం 3.20 గంటలకు వైజాగ్ నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. సాయంత్రం 4.02 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు SMVT బెంగళూరు చేరుకుంటుంది.
⦿ తిరుగు ప్రయాణంలో(రైలు నెం. 08582) SMVT బెంగళూరు-విశాఖపట్నం వీక్లీ స్పెషల్ రైలు సెప్టెంబర్ 15 నుంచి డిసెంబర్ 1 వరకు నడవనుంది. సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు SMVT బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.40 గంటలకు దువ్వాడకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.42 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.
ఈ రైళ్లు ఏ స్టేషన్ లో ఆగుతాయంటే?
ఈ రైళ్లు అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాటపాడి, జోలార్‌పేట, కుప్పం, బంగారుపేట మరియు కృష్ణరాజపురం వద్ద ఆగుతాయి. ఈ రైళ్లలో రెండు II టైర్ AC, మూడు III టైర్ AC, రెండు III AC ఎకానమీ, 8 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్, ఒక సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/దివ్యాంగ్జన్, ఒక లగేజ్/జనరేటర్/బ్రేక్ వ్యాన్ ఉంటాయి.
Read Also: ఈ యాప్‌లో రైలు టికెట్లు బుక్ చేసుకుంటే 30 శాతం క్యాష్ బ్యాక్!
ఈ ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు ప్రయాణీకులకు సూచించారు. పండుగల వేళ అధిక రద్దీతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. పండుగ సమయానికి మరిన్ని అదనపు రైళ్లను నడిపే అంశంపైనా చర్చిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: సికింద్రాబాద్ నుంచి ఆ రైళ్లు బంద్, ఎందుకంటే?