Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు సినిమాల్లో కెరియర్ పీక్ లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఎంకరే ఇచ్చారు. 2014లో జనసేన అనే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సినిమాల మీద తన ఏకాగ్రత తగ్గించారు. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు ఇంకా చెయ్యను అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఇన్కమ్ సోర్సెస్ వేరొకటి లేకపోవడం వల్ల మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ చేసిన రియంట్రీ సినిమాలలో వకీల్ సాబ్ సినిమాని బెస్ట్ అని చెప్పాలి. వేణు శ్రీరామ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ సినిమాలేవి బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోవడం లేదు. లాస్ట్ గా వచ్చిన హరిహర వీరమల్లు సినిమా అంతంత మాత్రమే ఆడింది.
ఒకే నెలలో మూడు సినిమాలు
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకు అది ఒక పండగ. అయితే ఈ మధ్యకాలంలో ప్రతి హీరో పుట్టినరోజు సందర్భంగా తన పాత హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తమ్ముడు సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కేవలం తమ్ముడు మాత్రమే కాకుండా సెప్టెంబర్ రెండవ తారీఖున జల్సా సినిమా కూడా విడుదల చేస్తున్నారు.
అయితే సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఓజి సినిమా ముందు మళ్లీ పవన్ కళ్యాణ్ వి రెండు సినిమాలు రిలీజ్ చేయడం అవసరమా అనేది కొంతమంది అభిప్రాయం. కేవలం పుట్టినరోజు నాడు జల్సా సినిమా ఇస్తే సరిపోతుంది. ఇప్పటికే తమ్ముడు జల్సా సినిమాలు ఆల్రెడీ రి రిలీజ్ అయ్యాయి. మళ్లీ ఇప్పుడు రీ రిలీజ్ అన్న కూడా ఎవరికీ పెద్దగా వైబ్ రావడం లేదు.
విపరీతమైన అంచనాలు
సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓ జి సినిమా పైన విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అయితే ఈ అంచనాలను సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చెప్పలేము. రీసెంట్ టైమ్స్ లో విపరీతమైన అంచనాలతో వచ్చిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అసంతృప్తిని మిగిల్చాయి. అయితే ఈ సినిమా మీద మాత్రం భారీ హైప్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. దాన్ని సుజిత్ ఎలా మీట్ అవుతాడో చూడాలి. గతంలో సుజిత్ సాహో విషయంలో కూడా ఇదే జరిగింది. వాస్తవానికి ఆ సినిమా బాగానే ఉన్నా కూడా విపరీతమైన హైప్ వల్లనే ఆ సినిమా పోయింది. ఇప్పుడు ఓ జి సినిమా ఏం జరుగుతుందో అనేది సెప్టెంబర్ 25న తెలుస్తుంది.
Also Read: Tvk Maanadu: విజయ్ మానాడు సభ పై రజనీకాంత్ రియాక్షన్, హీటెక్కుతున్న తమిళ రాజకీయాలు