BigTV English

Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేష్!

Nara Lokesh: ఏపీ యువతకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన మంత్రి లోకేష్!

Nara Lokesh: రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం కీలక నిర్ణయాలతో కూడిన ప్రకటనలు చేసి విద్యారంగానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారని చెప్పవచ్చు. ఉండవల్లి నివాసంలో రాష్ట్రస్థాయి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, గత 14 నెలలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితాలను పరిశీలిస్తూ, భవిష్యత్ కార్యాచరణపై స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ సమావేశంలో విద్యా మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకాలు, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యతా ప్రమాణాలు, లైబ్రరీల అభివృద్ధి వంటి పలు అంశాలపై విస్తృత చర్చ జరిగింది.


రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో నిర్వహించిన మెగా డిఎస్సీని విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం, ఇకపై ప్రతీ ఏడాది డిఎస్సీ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, విద్యారంగంలో ఖాళీగా ఉన్న ప్రతి ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయడం మా లక్ష్యం. ప్రతీ ఏడాది డిఎస్సీ నిర్వహణతో బోధనలో ఎలాంటి లోటు ఉండకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనవసర శిక్షణ కార్యక్రమాలతో ఉపాధ్యాయుల సమయం వృథా కాకుండా చూసుకోవాలని, బోధన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అసర్ నివేదికలో ఎఫ్ఎల్ఎన్ ప్రోగ్రాం అమలులో రాష్ట్రం ప్రస్తుతం 14వ స్థానంలో ఉందని గుర్తుచేసిన మంత్రి, ప్రతీ పిల్లవాడికి గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎన్ హక్కుగా అందించడం దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు కానుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ హక్కు ప్రతి విద్యార్థికి చేరేలా ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.


తల్లికి వందనం నిధుల విడుదల
‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ప్రభుత్వం, చివరి విడతగా రూ.325 కోట్లు విడుదల చేసి పెండింగ్ దరఖాస్తులను ఆమోదించింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను కూడా త్వరగా విడుదల చేసే దిశగా చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు భూసేకరణ ప్రక్రియను దాతల సహకారంతో పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో కీలక మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు దాతల సహకారం తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. తమ గ్రామంలోని పాఠశాలలను దత్తత తీసుకోవాలనుకునే వ్యక్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించి, అవసరమైన మౌలిక సదుపాయాలను అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే, కార్పొరేట్ సంస్థల సహకారంతో పాఠశాలల్లో ఆధునిక వసతులను ఏర్పరచాలన్నారు.

అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కడప, చిత్తూరు జిల్లాల్లో ఆధునీకరించిన సైన్స్ సెంటర్లు త్వరగా ప్రారంభించి, విద్యార్థులకు శాస్త్రపరమైన అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మంజూరైన 125 ఆటిజం సెంటర్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి, ఏడాదిలో ప్రారంభించాలన్నారు.

దేశంలోనే అత్యుత్తమ సెంట్రల్ లైబ్రరీ అమరావతిలో
విద్యార్థుల కోసం అధునాతన సదుపాయాలతో కూడిన సెంట్రల్ లైబ్రరీ నిర్మాణానికి ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించబోయే ఈ లైబ్రరీని ఏడాదిలో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. విశాఖపట్నం జగదాంబ సెంట్రల్‌లో 50 వేల చదరపు అడుగుల్లో రీజనల్ లైబ్రరీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సూచించారు.

Also Read: AP heli tourism: కార్లకు గుడ్‌బై.. ఇక హెలికాఫ్టర్ రైడ్స్ తోనే టూర్స్.. ఏపీలో ఇక జర్నీ గాలిలోనే!

ప్రస్తుతానికి రాష్ట్రంలో కేవలం 13 జిల్లా గ్రంథాలయాలు ఉన్నాయని గుర్తుచేసిన మంత్రి, కొత్త జిల్లాల కేంద్రాల్లో కూడా లైబ్రరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ లైబ్రరీలను ఒకే సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానించి, అందులో బుక్ యాక్సెస్, మౌలిక సదుపాయాలు, మేనేజ్‌మెంట్ వివరాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

సెస్ నిధులతో అభివృద్ధి
లైబ్రరీల అభివృద్ధి కోసం స్థానిక సంస్థల వద్ద పెండింగ్‌లో ఉన్న రూ.213 కోట్ల సెస్ నిధులను రాబట్టేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పబ్లిక్ లైబ్రరీల్లో కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లు నిర్వహించి, విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచే దిశగా కొత్త కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలన్నీ లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా, సర్వశిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ ఎండి సి.ఎన్. దీవెన్ రెడ్డి, పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ కృష్ణమోహన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Related News

Aruna Srikanth: ఆ ఇద్దరు ఎమ్మెల్యేల సిఫారసులు పనిచేయలేదట..! మరి అరుణ ప్రియుడికి అండగా నిలిచిందెవరు?

Tirumala accident: తిరుమల ఘాట్ రోడ్‌లో ఘోర ప్రమాదం.. ఆ దేవదేవుడే కాపాడినట్లే!

AP Smart cities: 12 నగరాలకు కొత్త రూపం.. అక్కడ కోట్లల్లోనే ఖర్చు!

Prakashraj Pavan: ప్రకాష్ రాజ్ చిలిపి సందేశం.. ఇక్కడ కూడా పవన్ ని ఇరికించాలా?

YS Sharmila: షర్మిల సంచలన పోస్ట్.. జగన్ లోగుట్టు, కొత్త నిర్వచనం

Big Stories

×