ఏపీలో మళ్లీ పెన్షన్ల గొడవ మొదలైంది. దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ల వడపోత మొదలవడంతో చాలామంది అనర్హులకు సెప్టెంబర్-1 నుంచి పెన్షన్ ఆగిపోనుంది. అలాంటి వారికి నోటీసులు ఇచ్చి మరీ ప్రభుత్వం పెన్షన్ నిలిపేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష వైసీపీ రచ్చ చేస్తోంది. అర్హులను తొలగిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కూటమి హయాంలో పేదల పెన్షన్లు తీసివేస్తున్నారని, వికలాంగులను కష్టాలపాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే అసలు వాస్తవం వేరే ఉందని అంటున్నారు కూటమి నేతలు. వైసీపీ చేసిన మోసాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయని స్పష్టం చేశారు.
తప్పుడు సర్టిఫికెట్లు..
2019లో టీడీపీ అధికారంలోనుంచి దిగిపోయే నాటికి రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులు 6లక్షల మంది ఉన్నారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో వైసీపీ హయాంలో ఏకంగా 2.07 లక్షల పెన్షన్లు పెరిగాయి. అంతమంది వికలాంగులు కొత్తగా పెన్షన్లు తీసుకోవడం మొదలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల పెన్షన్ ని రూ.3వేలనుంచి రూ.6 వేలకు.. కొన్ని అనారోగ్య సమస్యలున్నవారికి రూ.5 వేలుగా ఉన్న పెన్షన్ ను రూ.15వేలకు పెంచింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై తీవ్ర భారం పడింది. అయితే వికలాంగుల పేరుతో తప్పుడు ధృవీకరణ పత్రాలు తెచ్చుకుని చాలామంది పెన్షన్లు పొందుతున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపించాయి. దీంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. గత 9 నెలలుగా వైద్య అధికారులు పెన్షన్ల విషయంపై ఫోకస్ పెట్టారు. మొత్తం 7.95లక్షల దివ్యాంగ పెన్షన్లను రీ వెరిఫికేషన్ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 5.55 లక్షల మంది సర్టిఫికెట్లు పరిశీలించారు. వీరిలో అర్హులందరి సర్టిఫికెట్లు అప్ లోడ్ అయ్యాయి. అనర్హులకు నోటీసులు ఇచ్చారు. మాన్యువల్ సర్టిఫికెట్లు ఉన్న కొంతమంది విషయంలో అవి టెంపరరీ సర్టిఫికెట్లలోకి కన్వర్ట్ అయ్యాయి. దీంతో గొడవ మొదలైంది. నోటీసులు అందుకున్నవారు, వారికి సపోర్ట్ గా వైసీపీ నేతలు రంగంలోకి దిగారు.
వైసీపీ మోసాలు..
దివ్యాంగుల పెన్షన్ విషయంలో వైసీపీ హయాంలో చాలా తప్పులు జరిగాయని అంటున్నారు. లక్షల్లో అనర్హులు లబ్ధిదారులుగా మారారనే ఆరోపణలున్నాయి. శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం నార్సింపల్లి చెందిన వైసీపీ కార్యకర్త పాలయ్యగారి రమేష్ కి దివ్యాంగ పెన్ష్ లబ్ధిదారుడు. ఇటీవల అతడికి పెన్షన్ ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం నోటీసు ఇచ్చింది. తనకు చేయి లేదని, తనకు వచ్చే దివ్యాంగుల పెన్షన్ ని అన్యాయంగా తొలగించారంటూ అతను ఓ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో వైరల్ అయింది, వైసీపీ నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. వాస్తవానికి సదరు రమేష్ కి కుడిచేయి భేషుగ్గా ఉంది. గ్రామస్తులకు అసలు నిజం తెలుసు కాబట్టి, వారు అతడి అసలు వీడియోలు బయటపెట్టారు. దీంతో వైసీపీ బండారం బయటపడినట్టయింది. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు అని ఇప్పుడు తేలిపోయింది. వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా దివ్యాంగుల కోటాలో పెన్షన్లు తీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అర్హులకు న్యాయం..
బోగస్ పెన్షన్ల ఏరివేత విషయంలో అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. పెన్షన్ల రీవెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం పారదర్శకంగా జరిగిందని చెప్పారాయన. అర్హులెవరైనా తమకు అన్యాయం జరిగిందని భావిస్తే.. సర్టిఫికెట్లతో సమీప సచివాలయాన్ని సందర్శించాలని అధికారులు సూచించారు. దివ్యాంగ పెన్షన్ కోల్పోయిన వారు 60 ఏళ్లు పైబడి ఉంటే వృద్ధాప్య పెన్షన్, భర్తని కోల్పోయి ఉంటే వితంతు పెన్షన్ పొందే అవకాశం ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==