Rinku Singh Love Story: భారత క్రికెట్ జట్టు టి-20 స్పెషలిస్ట్ బ్యాటర్, ఐపీఎల్ స్టార్ రింకు సింగ్ {Rinku Singh}.. ఎట్టకేలకు తన లవ్ స్టోరీ ని రివీల్ చేశాడు. సమాజ్ వాది పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ తో తన ప్రేమ ప్రయాణం, ఎంగేజ్మెంట్ కి దారి తీసిన పరిస్థితులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అనూహ్యంగా వీరి ఎంగేజ్మెంట్ వార్త బయటకు రావడంతో ఆశ్చర్యపోయిన అభిమానులకు.. రింకూ సింగ్ తన మాటలతో పూర్తి స్పష్టత ఇచ్చాడు. 2022లో కోవిడ్ సమయంలో ముంబై లో ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సందర్భంలో ప్రియా సరోజ్ తో ప్రేమ మొదలైనట్లు వెల్లడించాడు.
Also Read: Shubman Gill: ఆసియా కప్ కు ముందు టీమిండియా కు ఎదురు దెబ్బ…. ఎమర్జెన్సీ వార్డులో గిల్ ?
తాజాగా ఓ ఇంటర్వ్యూలో రింకూ {Rinku Singh} మాట్లాడుతూ.. ” ఓ మ్యాచ్ కోసం నేను ముంబై వచ్చినప్పుడు ఓ ఫ్యాన్ పేజీలో ప్రియా సరోజ్ ఫోటోని చూసి ఆమెను ఇష్టపడ్డాను. ఆమె కోసం ఓ గ్రామంలో ఓటింగ్ కోసం సహాయం కోరుతూ ఆ ఫోటో పెట్టాడు. ఆమె సోదరీ ఫొటోస్, వీడియోస్ తీస్తుంటుంది. అలా ప్రియా సరోజ్ ఫోటో చూడగానే నాకు బాగా నచ్చింది. నాకు తనే సరైన భాగస్వామి అని అనిపించింది. కానీ ఈ విషయం చెప్పడానికి ధైర్యం చాలలేదు. వెంటనే ఆమెకు మెసేజ్ చేద్దామని అనుకున్నప్పటికీ.. అలా చేయడం సరికాదని ఆగిపోయాను.
కొద్ది రోజులకు నా ఇంస్టాగ్రామ్ లోని ఫోటోలకు ప్రియా సరోజ్ లైక్ చేసినట్లు గుర్తించాను. వెంటనే ఆమెకు మెసేజ్ చేశాను. ఇక అప్పటినుండి ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళం. కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుంది అనే సమయంలో కూడా మాట్లాడుకునే వాళ్ళం. అలా కొంతకాలం గడిచాక.. కలిసి జీవితాన్ని పంచుకోవాలనే అభిప్రాయానికి వచ్చాము. ఆ తరువాత ప్రియా ఎంపీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. మా మధ్య ఉన్న ప్రేమలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆమె ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ ఉంటుంది.
అలాగే పార్లమెంట్ సమావేశాల్లోనూ పాల్గొంటుంది. ఇక నేను మ్యాచ్ లతో బిజీగా ఉండటం వల్ల మాట్లాడుకోవడానికి ఎక్కువగా సమయం దొరకలేదు. అందువల్ల రాత్రి వేళల్లో కాసేపు మాట్లాడుకుంటున్నాం. ఇద్దరి వ్యక్తిగత, వృత్తికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ.. అవసరమైన సమయంలో తగిన సలహాలు, సూచనలు ఇచ్చిపుచ్చుకుంటున్నాం” అని తెలిపాడు రింకు సింగ్. ఇక ఈ జంటకు జూన్ 8న నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
Also Read: Asia Cup 2025: ఆసియా కప్ ఆడే బంగ్లాదేశ్ జట్టు ఇదే.. ఏకంగా 16 మంది సభ్యులతో
ఈ నిశ్చితార్థానికి బాలీవుడ్ నటుడు, కలకత్తా నైట్ రైడర్స్ యాజమాని షారుఖ్ ఖాన్ ని కూడా ఆహ్వానించామని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన రాలేకపోయారని తెలిపాడు రింకూ. కాగా నవంబర్ లో వీరి వివాహం ఘనంగా జరగనున్నట్లు పలు కథనాలు వెలువడినప్పటికీ.. దేశవాళీ టోర్నమెంట్లు, ఇంటర్నేషనల్ సీజన్ ఉన్నందున వీరి పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఇక రింకూ సింగ్ ఇప్పటివరకు భారత్ తరఫున 2 వన్డేలు, 33 టీ-20 లు ఆడాడు. మరోవైపు ఐపీఎల్ లో కొన్నేళ్లుగా కలకత్తా నైట్ రైడర్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఇతడికి కాబోయే భార్య ప్రియా సరోజ్.. 2024 ఎన్నికల్లో మచిలీ షహార్ నుంచి ఎంపీగా ఎన్నికైంది.