E-Paper
Advertisement

Raghu rama Raju Third Degree Case: రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు..ఏపీ పోలీసులకు చిక్కిన ఐపీఎస్ అధికారి

Raghu rama Raju Third Degree Case: రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు..ఏపీ పోలీసులకు చిక్కిన ఐపీఎస్ అధికారి
Advertisement

Raghu rama Raju Third Degree Case: మాజీ ఎంపీ రఘరామరాజు థర్డ్ డిగ్రీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఓ అడుగు ముందుకుపడితే.. మరొక అడుగు వెనక్కి వెళ్తోంది. తాజాగా బీహార్‌కి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు విచారణ ఇకపై వేగవంతం కానుంది.

రఘురామరాజు థర్డ్ డిగ్రీ కేసు కొత్త మలుపు

Advertisement

వైసీపీ హయాంలో నమోదు చేసిన కేసులు స్పీడందుకున్నాయి.  మాజీ ఎంపీ రఘరామరాజు థర్డ్ డిగ్రీ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్‌ని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ రాజధాని పాట్నాలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్‌లో ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేసులో విచారణకు రావాలని కొంతకాలంగా పలుమార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు.

ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. పరిస్థితి గమనించిన ఏపీ పోలీసులు నేరుగా రంగంలోకి దిగేసి అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఈ కేసు దర్యాప్తు జోరందుకోనుంది.  వైసీపీ రూలింగ్‌లో ఏపీ సీఐడీలో డిప్యుటేషన్‌పై పని చేశారు సునీల్ నాయక్. 2021లో రఘురామకృష్ణంరాజు అరెస్టు చేసిన సమయంలో సీఐడీ కస్టడీలో సునీల్ నాయక్ నేతృత్వంలో టీమ్ ఆయన్నివిచారించింది.

Advertisement

సీనియర్ ఐపీఎస్‌ని అరెస్టు చేసిన ఏపీ పోలీసులు

ఆ సమయంలో ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని మాజీ ఎంపీ, ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. కాళ్లపై కొట్టడం, మానసికంగా వేధించడం వంటి చర్యల్లో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు రఘురామరాజు.

ఈ కేసు వ్యవహారం గురించి తొలుత బీహార్ ప్రభుత్వానికి ఏపీ పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. పట్నాలోని స్థానిక కోర్టులో ఆయన్ని హాజరు పరిచారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ కోరారు. న్యాయస్థానం నుంచి అనుమతి లభించడంతో ఆయన్ని సోమవారం సాయంత్రానికి గుంటూరు తీసుకురానున్నారు.

ALSO READ:  తిరుమల లడ్డూ ఇష్యూ.. వైసీపీకి సుప్రీంకోర్టులో దక్కని రిలీఫ్

సునీల్ నాయక్ అరెస్టుతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్టు ఈ కేసుతో స్పష్టమైంది. ఇదే కేసులో మరికొందరు ఉన్నతాధికారులు విచారణ చేసే అవకాశమున్నట్లు అమరావతి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×