Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు మరోసారి నోటీసులిచ్చారు. హైదరాబాద్‌లోని కాకాణి నివాసానికి ఏపీ పోలీసులు వెళ్లారు. ఆయన ఇంట్లో లేరని చెప్పడంతో బంధువులకు నోటీసులు ఇచ్చి వెళ్లారు. గురువారం నెల్లూరు డీఎస్పీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అటు ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. అడిషనల్ సెక్షన్స్ తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలను మెమో రూపంలో ప్రభుత్వ తరపు న్యాయవాది దాఖలు చేయనున్నది. మరోవైపు పోలీసుల విచారణకు కాకాణి హాజరవుతారా? లేదా? ముందస్తు బెయిల్ వస్తుందా.. రాదా అని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
వరుస కేసులతో కాకాణి సతమతం
కాకాణిపై చర్యలు తీస్కోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టునెల్లూరు జిల్లాలోనే సీనియర్ లీడర్ గా మాజీ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఒకటి అరా కాదు వరుస కేసులతో సతమతమవుతున్నారు. ఇటు వరుస కేసుల కాక. అటు సొంత పార్టీ సపోర్టు లేక.. ఆయన పరిస్థితి వర్ణనాతీతంగా మారిందట.
రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ పై కేసు నమోదు
నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం తాటిపర్తిలో రూ. 250 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ జరిగిందన్న కేసు నమోదయ్యింది. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణి పేరు కూడా పొందుపరచడంతో నెల్లూరు రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఈ కేసులో ఆయన హైకోర్టునాశ్రయించారు.
ఇప్పటికే పోలీసులు రెండు సార్లు నోటీసులు
ఇదిలాగుంటే.. విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులకు మాజీ మంత్రి సరిగా స్పందించలేదు. విచారణకు కాకాణి వస్తారా రారా అన్న చర్చ నడుస్తుండగానే.. మరో కేసు నమోదయ్యింది.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది.
మైనింగ్ కేసులో కాకాణిపై అదనంగా SC\ST కేసు
మైనింగ్ కేసులో అదనంగా ఈ ఎస్సీ ఎస్టీ కేసు నమోదయ్యింది. రుస్తం మైన్స్ లో పేలుడు పదార్ధాల వినియోగం విషయంలో గిరిజనులను బెదిరించినట్టుగా.. కాకాణిపై అదనపు సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం ఇప్పుడు హాట్ టాపిగ్గా మారింది.
త్వరలో కాకాణి అరెస్టు అన్న ప్రచారం
మరో పక్క త్వరలోనే కాకాణి అరెస్టు ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తరచూ ప్రభుత్వాన్ని విమర్శించేవారు. ఈ విషయంలో ఆయన చాలానే యాక్టివ్ గా ఉండేవారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం ఆయనపై దృష్టి సారించిందనే చర్చ నడుస్తోంది.
వరుస కేసులతో ఒంటరిగా మిగిలిన కాకాణిగా చర్చ
మాజీ మంత్రిపై వరుస కేసులు నమోదు కావడం కూడా.. జిల్లాలో ప్రస్తుతం అతి పెద్ద చర్చగా మారింది. జిల్లా నుంచి బలమైన వాయిస్ వినిపించే కాకాణిపై కేసులు నమోదు కావడం.. పార్టీ పై ప్రభావం పడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మిగిలిన నాయకులెవరూ జిల్లాలో పెద్దగా యాక్టివ్ గా లేని దుస్థితి. ఇటు జిల్లా సమస్యలే కాక అటు రాష్ట్ర స్థాయిలోనూ పార్టీ తరఫున నిలబడి కలబడే నాయకుడిగా కాకాణికి పేరుంది. ఈ పరిస్థితుల్లో ఆయనపై వరుస కేసులు వెంటాడ్డం.. పార్టీకి కష్టాలు తప్పవన్న ప్రచారం జరుగుతోంది.
కాకాణి విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్న ఇతర నాయకులు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం వరుస కేసులతో రాజకీయంగా ఒంటరిగా మిగిలారన్న మాట కూడా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి కానీ జిల్లాలోని మిగిలిన లీడర్ల నుంచి కానీ ఆయనకంటూ ఒక సహకారం లేనట్టుగా భావిస్తున్నారు. ఇప్పటి వరకూ పార్టీలోని ఇతర నాయకుల నుంచి కూడా బహిరంగ మద్ధతు ప్రకటన రాని దుస్థితి కనిపిస్తోంది. అధిష్టానం నుంచి కనీస స్పందన కరవైన పరిస్థితి.
Also Read: రజినికి చుక్కెదురు.. ఇక జైలుకేనా?
కాకాణికి సపోర్టుగా నిలిస్తే తామెక్కడ టార్గెట్ అవుతామో అన్న భయం
దీనికి తోడు పార్టీలోని మిగిలిన వారు కూడా.. కాకాణి వ్యవహారంలో జాగ్రత్త వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ కాకాణికి మద్ధతుగా తాము మీడియా ముందుకొచ్చి మాట్లాడితే.. తామెక్కడ టార్గెట్ అవుతామో అన్న భయంలో వీరున్నట్టు సమాచారం. వీటన్నిటినీ బట్టీ చూస్తే ఇటు రాజకీయంగా అటు కేసుల పరంగా కాకాణికి అయితే కొన్నాళ్ల పాటు కష్టాలు తప్పవన్న మాట వినిపిస్తోంది.
కాకాణిపై చర్యలు తీస్కోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న హైకోర్టు
హైకోర్టునాశ్రయించిన కాకాణికి అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కాకాణిపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని ఉన్నత న్యాయ స్థానం చెప్పింది. దీంతో మింగలేక కక్కలేని పరిస్థితిలో కాకాణి పడ్డట్టుగా తయారైందట. మరి చూడాలి.. కాకాణి తనకొచ్చిన ఈ కష్టాల నుంచి ఎలా గట్టెక్కుతారో తేలాల్సి ఉంది.