Dulquar Salman:మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dhulquer Salman) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో నేరుగా ‘సీతారామం’ సినిమాలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరో అయిపోయారు. అంతకుముందు ‘మహానటి’ సినిమాలో కూడా జెమినీ గణేషన్ (Jemini Ganeshan) పాత్ర పోషించి, ఆకట్టుకున్న ఈయన ఇక తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతూ ఈ మధ్య తెలుగులోనే నేరుగా సినిమాలు చేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Megastar Mammootty) కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన దుల్కర్ సల్మాన్ ఈ మధ్యకాలంలో సౌత్ లో మార్కెట్ పెంచుకోవడానికి బాగా కష్ట పడుతున్నారు అని చెప్పవచ్చు.
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న దుల్కర్ సల్మాన్..
ఇకపోతే దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఇటీవల తెలుగులో ‘లక్కీ భాస్కర్’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈయన.. ఈ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయారు.అంతేకాదు ఈ సినిమా తెచ్చిన క్రేజ్ తో మరో 2 చిత్రాలలో కూడా అవకాశం కూడా అందుకున్నారు. అటు మలయాళం లో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయారు. ఇదిలా ఉండగా దుల్కర్ సల్మాన్ కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలు ఇప్పటి ఫోటోలు చూసిన నెటిజన్స్.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా దుల్కర్ సల్మాన్ స్టైల్ కి , అందానికి అమ్మాయిలు ఫిదా అవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయనకు లక్షలాదిమంది అమ్మాయిలు అభిమానులుగా ఉన్నారు కూడా.. ఈ క్రమంలోనే ఆయన పాత ఫోటోలు బయటపడడంతో అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రూమర్స్ పై క్లారిటీ ఇస్తారా..
ఇక ఫోటోలను మనం గమనించినట్లయితే.. తాజా ఫోటోలు, ఇప్పటి ఫోటోలు చూస్తే దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు దుల్కర్ సల్మాన్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడని డాక్టర్ మిథున్ చెప్పినట్లు కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ దుల్కర్ సల్మాన్ పాత ఫోటోలు , ఇప్పటి ఫోటోలు చూస్తే మాత్రం ఇదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి డాక్టర్ సంగతి ఏంటో ఇక తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి దీనిపై దుల్కర్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
Jack Trailer : డిఫరెంట్ స్టోరీతో సిద్ధు… కానీ, ఆ బూతులు ఏంటి సామి..?
దుల్కర్ సల్మాన్ కెరియర్..
ఇక దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. 2012లో వచ్చిన ‘సెకండ్ షో’ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన రెండవ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’ సినిమాలో నటించారు ..ఈ సినిమా జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ ప్రజాధారణ పొందిన వినోద చిత్రంగా పురస్కారం అందుకుంది.. ఇక తరువాత పలు చిత్రాలలో నటించిన ఈయన రెండు సార్లు ఫిలింఫేర్ అవార్డులను కూడా అందుకున్నారు. అంతేకాదు కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాలలో ఉత్తమ నటుడు అవార్డు కూడా లభించింది.ఇక ఇప్పుడు సౌత్ లో మార్కెట్ పెంచుకొని పాన్ ఇండియా హీరోగా చలామణి అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్.