KA Paul: ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో సిద్ధహస్తుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏదైనా విషయాన్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కోసారి క్రెడిట్ వస్తుంది.. మరోసారి బుక్కైయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ఆయనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఆయన వేసిన పిటిషన్ ఏంటో తెలుసా?
కేఏ పాల్‌పై సుప్రీంకోర్టు గరంగరం
ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్దతిలో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యందాఖలు చేశారు కేఏ పాల్. ఆయన వేసిన పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు సోమవారం విచారించింది. ఆ పిటిషన్‌ను పరిశీలించింది న్యాయస్థానం.
ఈ క్రమంలో ఆయన తీరుపై అసహనం వ్యక్తం చేసింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాలపై ముందుగా హైకోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. వీటిపై నేరుగా సుప్రీంకోర్టుకు రావడం ఏమిటన్నది న్యాయస్థానం మాట. పబ్లిసిటీ కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని మండిపడింది.
ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు
ఇలాంటి పిటిషన్లతో న్యాయవ్యవస్థ విలువైన సమయం వృథా అవుతోందని పేర్కొంది. చట్టపరమైన మార్గాలను అనుసరించకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సరికాదని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ జరపడానికి నిరాకరించింది సుప్రీంకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లాలని ఆయనకు సూచించింది. మరి కేఏ పాల్ హైకోర్టుని ఆశ్రయిస్తారా? అంటే చెప్పడం కష్టమే.
ఈ వ్యవహారంపై ఇటీవల ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పీపీపీ పద్దతి నిర్మిస్తే తప్పేంటని పిటిషన్ దారులను ప్రశ్నించింది. పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది న్యాయస్థానం.
ALSO READ: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ పట్టుబడిన టీటీడీ సిబ్బంది
ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదేనని అభిప్రాయపడింది. పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధాన పరమైన నిర్ణయమని తేల్చి చెప్పింది. రాజ్యాంగ-చట్ట విరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేఏ పాల్ హైకోర్టుకి వెళ్తారా? లేదా? అనేది చూడాలి.