Virat Kohli: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో ( Indian Premier League 2025 Tournament )… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి తీవ్ర గాయం అయింది. దీంతో విరాట్ కోహ్లీ తర్వాతి మ్యాచులు ఆడేది… కష్టమేనా అని చెబుతున్నారు విశ్లేషకులు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో బుధవారం రోజున రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది గుజరాత్ టైటాన్స్.
Also Read: RCB VS GT: వరుస విజయాలకు బ్రేక్… పాయింట్స్ టేబుల్ లో కిందికి పడిపోయిన RCB !
విరాట్ కోహ్లీకి తీవ్ర గాయం
గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్యన మ్యాచ్ జరగగా…. ఈ మ్యాచ్ లో… విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయపడ్డాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్… కొట్టిన బంతిని ఆపబోయి విరాట్ కోహ్లీ.. గాయపడ్డాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్లో 12 ఓవర్ క్రునాల్ పాండ్యా వేశాడు. అయితే ఆ ఓవర్ లో సాయి సుదర్శన్… ఫుల్ ఆన్ షాట్ ఆడాడు. అయితే ఆ బంతిని అందుకునే క్రమంలో విరాట్ కోహ్లీ చేతికి బలంగా గాయం అయితే అయింది. దీంతో మోకాళ్లపై కూర్చొని విలవిలలాడిపోయాడు విరాట్ కోహ్లీ. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే విరాట్ కోహ్లీ తీవ్రంగా గాయపడడంతో… తర్వాతి మ్యాచ్లకు విరాట్ కోహ్లీ దూరమవుతాడని అంటున్నారు. ఆ గాయం తీవ్రత మరింత ఎక్కువైతే… టోర్నమెంట్ నుంచి కూడా విరాట్ కోహ్లీ దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ వార్త బయటకు రావడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం అలాగే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. విరాట్ కోహ్లీ వెంటనే కోలుకోవాలని… కోరుకుంటున్నారు.
Also Read: Dhanashree Verma: క్రికెటర్ కు విడాకులు…హైదరాబాద్ కు పారిపోయిన కిలాడీ లేడీ ?
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి ఓటమి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో వరుసగా రెండు మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడుకు బ్రేకులు వేసింది గుజరాత్ టైటాన్స్. బుధవారం జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తు చేసింది గుజరాత్ టైటాన్స్. ఈ దెబ్బకు పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానానికి పడిపోయింది. ఇలాంటి నేపథ్యంలో విరాట్ కోహ్లీకి గాయం కావడం నిజంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తీవ్ర నష్టం అని చెప్పవచ్చు. ఇక అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పాయింట్స్ టేబుల్ లో పంజాబ్ కింగ్స్ మొదటి స్థానంలోకి వెళ్ళింది.