BigTV English
Advertisement

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

TTD Staff Suspended: తిరుమలలో మరో అపచారం.. నాన్ వెజ్ తింటూ దొరికిన టీటీడీ సిబ్బంది.. ఇద్దరిపై వేటు

TTD Staff Suspended: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలిపిరి మెట్ల నుంచి కొండ పై వరకు నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగుతుంది. ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టీటీడీ సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టీటీడీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్రశ్నించారు. ఆ సిబ్బంది తప్పు ఒప్పుకోకపోగా.. తిరిగి బెదిరింపు ధోరణిలో వ్యవహరించడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం టీటీడీ అధికారులకు తెలియడంతో ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై వేటు వేశారు.


ఇద్దరు సిబ్బందిపై వేటు

అలిపిరి మార్గంలో నాన్ వెబ్ తిన్నారన్న ఆరోపణలతో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు టీటీడీ తెలిపింది. ఈ విషయంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నందుకు ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రామస్వామి, సరసమ్మపై కఠిన చర్యలు తీసుకున్నామని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ ఫిర్యాదుతో ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ ఎండోమెంట్స్ చట్టంలోని సెక్షన్ 114 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

నాన్ వెజ్, మద్యం, పొగాకుపై నిషేధం

టీటీడీ నిబంధనల మేరకు తిరుమల పరిధిలో మాంసాహారం, మద్యం లేదా పొగాకు వినియోగం పూర్తిగా నిషేధించారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని టీటీడీ స్పష్టం చేసింది. తాజాగా అలిపిరి సమీపంలో ఇద్దరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించి నాన్ వెజ్ భోజనం చేయడం కలకలం రేపింది. దీంతో టీటీడీ నిఘాపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. భక్తుల నుంచి ఫిర్యాదు రాగానే టీటీడీ చర్యలు చేపట్టింది. ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరమల కొండ ఆధ్యాత్మిక, సాంస్కృతిక పవిత్రతను కాపాడటానికి టీటీడీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని అధికారులు స్పష్టం చేశారు.


Also Read: KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

ఇలాంటి ఘటనలే

అలిపిరిలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదని తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కొంత మంది భక్తులు తిరుమలకు మాంసాహారాన్ని తీసుకొచ్చి తింటూ దొరికిపోయారు. మార్చిలో ఇద్దరు వ్యాపారులు మద్యం, గంజాయి తిరుమలకు తరలిస్తూ పట్టుబడ్డారు. అప్పటి నుంచి టీటీడీ అధికారులు అలిపిరి వద్ద తనిఖీలను ముమ్మరం చేసి భద్రతా చర్యలను పటిష్టం చేశారు. తిరుమల పవిత్రతను కాపాడడానికి శాఖాహారం, కొన్ని రకాల పదార్థాలను మాత్రమే టీటీడీ కొండపైకి అనుమతిస్తుంది.

Related News

Roja: ఇక చెన్నైలోనే రోజా? ఎన్న తలైవా.. ఆ పార్టీలో పదవి ఇరుక్కా?

KA Paul: వార్తల్లోకి కే‌ఏ పాల్.. సుప్రీంకోర్టు గరంగరం, ఏం జరిగింది?

Jagan Tweet: సీపీ బ్రౌన్ జయంతికి జగన్ నివాళి.. కామెంట్లు మామూలుగా లేవు

TDP Politics: కొందరు నేతలపై మంత్రి లోకేష్ సీరియస్.. ఏం జరిగింది? మళ్లీ వచ్చేసరికి

Jagan Chandra Babu: ఎన్నికల వేళ జగన్ బయటకు తీసిన అస్త్రం.. చంద్రబాబు ఇప్పుడే ప్రయోగించారు

Ap Govt: ఏపీ ప్రభుత్వం వారికి శుభవార్త.. కేవలం 20 రోజులే, ఇంకెందుకు ఆలస్యం

Winter Weather Report: పెరుగుతున్న చలి తీవ్రత.. వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు.. ఆ జిల్లాలకు హై అలర్ట్

Big Stories

×