Land Grabbing Case: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ఆగడాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. వైసీపీ రూలింగ్ ఎక్కడ చూసినా భూ కబ్జాలు చోటు చేసుకున్నాయన్నది ప్రభుత్వం మాట. దీనిపై ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా 700 కోట్ల రూపాయల భూ కుంభకోణంపై ఏపీలో హాట్ హాట్‌గా చర్చ మొదలైపోయింది.
ఏపీ సంచలనంగా మారింది 700 కోట్ల రూపాయల భూకబ్జా కేసు. ప్రస్తుతం ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. దీనికి సంబంధించి ధర్మసింగ్-శ్రీకాంత్ మధ్య ఫోన్ సంబాషణలో అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంపై ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో చీమకుర్తి శ్రీకాంత్ రియాక్ట్ అయ్యారు.
తనకు 700 కోట్ల రూపాయల ఆస్తులు లేవని, కావాలనే తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇబ్రహీంపట్నం రిటైర్డ్ సబ్-రిజిస్ట్రార్ అధికారి ధర్మసింగ్ ఒక దొంగ అని వ్యాఖ్యానించారు. తన వద్ద ఆస్తులున్నాయని నిరూపిస్తే వాటిని ఎవరిపేరు మీద రాయమన్నా రాస్తానన్నాడు. తాను ఎవరినీ బెదిరించలేదన్నది శ్రీకాంత్ వెర్షన్.
వైసీపీ హయాంలో దాదాపు రూ. 700 కోట్ల విలువైన భూముల అక్రమ రిజిస్టేషన్లు జరిగాయన్నది ప్రధాన పాయింట్. దీనిపై మాజీ సీఎం జగన్ సోదరుడు సునీల్, జగన్ పీఏ కేఎన్ఆర్, చీమకుర్తి శ్రీకాంత్, టీవీ నటి రీతూ చౌదరి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుకి లేఖ రాశారు ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ రిటైర్డ్ అధికారి ధర్మసింగ్. ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ, రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు.
ALSO READ: హోం మంత్రి అనితకు షాక్, పీఏ ఔట్.. కార్యకర్తల సంబరాలు
విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రితోపాటు మరి కొన్ని ప్రాంతాల్లో వందల కోట్ల ఆస్తులను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సీఎంకు రాసిన లేఖలోని ప్రధాన పాయింట్. ఈ ఆస్తుల విలువ దాదాపు రూ. 700 కోట్ల వరకు ఉంటుందని సింగ్ మాట. ప్రజలను బెదిరించి బలవంతంగా ఈ ఆస్తులు లాక్కున్నట్టు అందులో ప్రస్తావించారు.
కొన్ని ఆస్తులు వాటి యజమానులకు తెలియకుండానే చీమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ అయ్యాయని ప్రస్తావించారు. ఏసీబీతో దాడులు చేయిస్తామని తనను బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. తాను రిజిస్ట్రేషన్లు చేయకపోతే చంద్రబాబు మాదిరిగా తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించారని వెల్లడించాడు. తన కుటుంబ సభ్యులను వేధించి డాక్టర్ సుధాకర్ మాదిరిగా ఆత్మహత్య చేసుకునేలా చేస్తామని వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయా రిజిస్ట్రేషన్లకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నాడు సింగ్.
ఈ వ్యవహారంపై సింగ్ సబ్‌రిజిస్ట్రార్ రిటైర్ అధికారి. చీమకుర్తి శ్రీకాంత్ వైసీపీ బినామీగా చెబుతున్నారు. సీన్ కట్ చేస్తే.. ధర్మసింగ్-శ్రీకాంత్ మధ్య జరిగిన ఫోన్ సంభాషన్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ధర్మసింగ్ ఆరోపణలు కేవలం అబద్దాలు మాత్రమేనని, ఆయనకు ఆయన 40 లక్షలు ఇవ్వాలని అంటున్నాడు శ్రీకాంత్.
గతేడాది ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ ఒకరు. ఆయన ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఆనాటి నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 13 నెలలుగా ఎవరికీ తప్పించు కున్నాడు. గుంటూరులో పోలీసులకు పట్టుపడ్డాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరో ఏసీబీ విచారణలో అసలు నిజాలు బయటకు వచ్చేనా? లేక ఆస్తుల కేసు నుంచి తప్పించుకునేందుకు ధర్మసింగ్ ఈ విధంగా స్కెచ్ వేశాడా? సింగ్ చెప్పినట్లు అవన్నీ అవాస్తవాలైతే, నేరుగా మీడియా ముందుకు వచ్చి అసలు నిజాలు శ్రీకాంత్ చెబుతాడా? అనేది చూడాలి.
ఏపీలో సంచలనంగా మారిన రూ.700 కోట్ల భూకబ్జా కేసు
బిగ్ టీవీ చేతిలో కీలకమైన ఆడియో ఫైల్స్
ధర్మ సింగ్, శ్రీకాంత మధ్య ఫోన్ కాల్ సంభాషణ
చీమకుర్తి శ్రీకాంత్ ను జగన్ బినామీగా చెబుతున్న సింగ్
శ్రీకాంత్ పై చంద్రబాబుకు ఇబ్రహీంపట్నం మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మ సింగ్ ఫిర్యాదు
సింగ్ ఆరోపణలపై… pic.twitter.com/Y0kyPdguGY
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025