Actress Seetha:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సీత (Seetha)ఇంట్లో తాజాగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లి చంద్రమోహన్(88) శుక్రవారం చెన్నైలోనే సాలిగ్రామం(Saligramam)లోని తమ స్వగృహంలో తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంలో గుండె సమస్యలతో బాధపడుతున్న చంద్రమోహన్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రావతి(Chandravathi). సేలం కు చెందిన ఈమె.. చెన్నైకి చెందిన పీ.ఎస్. మోహన్ బాబు ను వివాహం చేసుకున్న తర్వాత తన పేరును చంద్రమోహన్ గా మార్చుకున్నట్లు సమాచారం.
ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్న సీత తల్లి..
వీరికి ఎంజీఆర్ పాండు , రాజమోహన్ అనే ఇద్దరు కుమారులతోపాటు కూతురు సీతా కూడా ఉన్నారు. చెన్నైలోని జీహెచ్ హాస్పిటల్ లో వైద్య సేవలు అందించిన ఈమె, ఆ తర్వాత స్థానిక సాలిగ్రామంలోని సూర్య హాస్పిటల్ లో తొమ్మిదేళ్లు వైద్య సేవలు కూడా అందించారు. మరోవైపు చంద్రమోహన్ భర్త పీ.ఎస్. మోహన్ బాబు నటుడిగా పలు సినిమాలలో నటించారు. దీంతో నటి సీతతో పాటు ఆమె సోదరులు కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక సీత తండ్రి గత పది సంవత్సరాల క్రితమే కన్నుమూయగా.. ఇప్పుడు చంద్రమోహన్ కూడా మరణించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు చంద్రమోహన్ కు శ్రద్ధాంజలి ఘటించి, సీత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు.
స్వగ్రామంలో సీత తల్లి అంత్యక్రియలు..
ఇకపోతే చంద్రమోహన్ భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో స్థానిక అరుంబాక్కం లోని స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇకపోతే సీత తండ్రి స్వస్థలం విజయనగరం జిల్లా, బొబ్బిలి ప్రాంతం కాగా.. ఈమె తండ్రి మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తూనే చెన్నైలో స్థిరపడ్డారు.
సీత వ్యక్తిగత జీవితం,సినిమాలు..
ఇక సీత వ్యక్తిగత జీవితం, సినీ కెరియర్ విషయానికి వస్తే.. 1990లో కెరియర్ పరంగా మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ప్రముఖ నటుడు పార్తీబన్ ను ప్రేమ వివాహం చేసుకుంది సీత. వీరికి అభినయ, కీర్తన అనే ఇద్దరూ కుమార్తెలతో పాటు రాఖీ అనే దత్తత కుమారుడు కూడా ఉన్నారు. ఇక మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో వచ్చిన ‘అమృత’ అనే సినిమా ద్వారా కీర్తన కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆర్టిస్ట్ గా నటించిన ఈమెకు ఉత్తమ బాలనటిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే పార్తీబన్ తో విభేదాలు రావడంతో ఇద్దరు కూడా విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తూ.. కెరియర్ లో ముందుకు వెళ్తున్న ఈమె, కొంతకాలానికి సీరియల్ నటుడు అయినా సతీష్ ను రెండవ వివాహం చేసుకుంది. ఇక కొంతకాలం తర్వాత అతనితో కూడా గొడవలు పడి విడాకులు తీసుకొని దూరమైంది. సీత ప్రస్తుతం పిల్లలతో ఉంటూ జీవితాన్ని గడుపుతున్న ఈమెకు ఇప్పుడు మాతృవియోగం కలగడం నిజంగా బాధాకరమని చెప్పాలి. ఇక సీత మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సీనియర్ హీరోలు యంగ్ హీరోలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారింది. సీతా కూతుర్లు మాత్రం ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి ఇప్పటికైనా వారు ఇండస్ట్రీలోకి వస్తారా లేక వ్యక్తిగత జీవితానికే పరిమితం అవుతారా అన్నది చూడాలి.