BigTV English

Minister Anitha: హోం మంత్రి అనితకు షాక్, పీఏ ఔట్.. కార్యకర్తల సంబరాలు

Minister Anitha: హోం మంత్రి అనితకు షాక్, పీఏ ఔట్.. కార్యకర్తల సంబరాలు

Minister Anitha: ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితకు ఊహించని షాక్ తగిలింది. దశాబ్దంగా ఆమె వద్ద పీఏగా పని చేస్తున్న జగదీష్‌పై వేటు వేసింది ప్రభుత్వం. ముఖ్యంగా అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ఆయనను తొలగించింది. అసలేం జరిగింది?


అధికారం ఉందని ఇష్టానుసారంగా రెచ్చిపోతే ఎలా ఉంటుందో చూపించింది కూటమి ప్రభుత్వం. ఎవరిపైనా వేటు వేయడానికి ఏం మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పే ప్రయత్నం చేసింది. మిగతావారికి కాసింత హెచ్చరిక లాంటిందే. హోం మంత్రి అనిత దగ్గర పదేళ్లుగా పీఏగా పని చేస్తున్నాడు జగదీష్.

మంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత పోస్టింగులకు సిఫార్సు చేయడానికి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని జగదీష్‌పై ఆరోపణలు తీవ్రమయ్యాయి. ఇదికాకుండా పేకాట శిబిరాలు, మద్యం దుకాణాల్లో వాటాలు కోసం వేధింపులు చేశాడనే ఆరోపణలు లేకపోలేదు. దీనికితోడు మంత్రి అనిత టీటీడీ సిఫార్సు లేఖలను తిరుమలలోని ఓ హోటల్‌కు అమ్మేశాడనే ఆరోపణలు మరింత ఎక్కువయ్యాయి.


ఇలా అన్నివైపుల నుంచి ఫిర్యాదు రావడంతో ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఎంక్వైరీ వేసి మరీ జగదీష్‌పై వేటు వేసింది. ఒక్కమాటలో చెప్పాలంటే తనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించేవాడు జగదీష్. ఈ క్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చివరకు పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

ALSO READ: విశాఖ టు కాకినాడ.. సముద్రం మధ్యలో స్విమ్మర్ శ్యామల అనుభవాలేంటి?

మంత్రి అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. జగదీష్ అరాచకాలను సహించలేని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కార్యకర్తలు, అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు వ్యవహారం జగదీష్ చెవిలో పడింది. దీంతో కార్యకర్తలకు ఫోన్ చేసి హెచ్చరించడం మొదలుపెట్టాడు. జగదీష్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పీఏగా తొలగిస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×