Udayabhanu: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో యాంకర్స్ అంటే ఉదయభాను (Udayabhanu), సుమ కనకాల(Suma Kanakala) పేర్లు గట్టిగా వినిపించేవి. ఇలా వీరిద్దరూ పోటీగా బుల్లితెర కార్యక్రమాలను చేస్తూ ఉండేవారు అయితే క్రమక్రమంగా సుమకు అవకాశాలు పెరగడం ఉదయభానుకు అవకాశాలు తగ్గడంతో ఉదయభాను పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఉదయభాను ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇండస్ట్రీలో యాంకరింగ్ సిండికేట్ నడుస్తుందని కొంతమంది ఉద్దేశపూర్వకంగానే అవకాశాలు లేకుండా తొక్కేస్తున్నారు అంటూ పలు సందర్భాలలో మాట్లాడారు.
ఈ విధంగా ఉదయభాను యాంకరింగ్ సిండికేట్ నడుస్తుందని అవకాశాలు లేకుండా తొక్కేస్తున్నారని మాట్లాడటంతో ఈమె పరోక్షంగా సుమను ఉద్దేశించే మాట్లాడారు అంటూ గతంలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా ఉదయభాను తన పంచనామా(Panchanaama) వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన కెరియర్ గురించి తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈమెకు యాంకర్ సుమ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. యాంకర్ సుమ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెబుతారు అనే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు ఉదయభాను సమాధానం చెబుతూ సుమ చాలా స్మార్ట్ అంటూ ఆమె గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడారు. సుమ చాలా తెలివైన అమ్మాయి. చాలా తెలివి ఉంది కాబట్టే అన్ని షోలు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ కాంపిటీషన్ లో కూడా రాణిస్తోందని ఉదయభాను తెలిపారు. ఇక సుమ కనకాలతో నాకు ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదు, అలాగే మిత్రుత్వం కూడా లేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. సుమ మాత్రం చాలా స్మార్ట్ అలాంటి తెలివితేటలు అందరికీ ఉండవు, చాలా తెలివైన అమ్మాయి కాబట్టి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. ఎంతైనా మలయాళం బ్లడ్ అంటూ సుమ గురించి ఉదయభాను చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ విధంగా ఉదయభాను సుమా గురించి మాట్లాడటంతో వీరిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని అయితే ఉదయభానుకు అవకాశాలు లేకపోవడానికి సుమ కారణమంటూ ఇన్ని రోజులు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టమవుతుంది. సుమ తన స్వశక్తితో, మాటతీరుతో వరుస అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ యాంకర్ గా మారిపోయారు. ఇక ఉదయభానుకు యాంకర్ గా అవకాశాలు రాని నేపథ్యంలో ఈమె కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా ఇండస్ట్రీకి దూరమైన ఈమె ఉదయభాను ప్రొడక్షన్ పేరుతో నిర్మాతగా మారారు. ఇక నిర్మాతగా పంచనామా అనే మొదటి వెబ్ సిరీస్ తోనే ఉదయభాను మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం జీ 5 లో ప్రసారమవుతోంది.
Also Read: పొలిటికల్ ఎంట్రీ పై ఉదయభాను క్లారిటీ… పోరాటం చేయాల్సిందే అంటూ!