E-Paper
Advertisement

రూ.60వేలలోపు అదిరిపోయే లెనోవో i5 ల్యాప్ టాప్..స్పెషల్ ఫీచర్లు ఇవే!

రూ.60వేలలోపు అదిరిపోయే లెనోవో i5 ల్యాప్ టాప్..స్పెషల్ ఫీచర్లు ఇవే!
Advertisement

Lenovo 14 2026 laptop: ప్రస్తుత టెక్ మార్కెట్‌లో విద్యార్థులు, ఉద్యోగుల కోసం లెనోవో సంస్థ అద్భుత మైన ల్యాప్‌ టాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. పవర్ పుల్ ఇంటెల్ కోర్ i5 13వ జనరేషన్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యా ప్‌టాప్, తక్కువ బరువుతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. రూ.59,880 ధరలో లభించే ఈ డివైస్ డైలీ వాడకానికి, ఆఫీస్ వర్క్‌కు చక్కగా సరి పోతుంది. తక్కువ ధరలోనే బెస్ట్ మోడల్ ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఈ ల్యాప్ ట్యాప్ పూర్తి వివరాలేంటో తెలుసుకుందామా..

పూర్తి ఫీచర్లు:

డిజైన్,లుక్:

ప్రస్తుత కాలంలో స్లిమ్, లైట్‌వెయిట్ ల్యాప్‌ టాప్‌లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. లెనోవో 14 మోడల్ కేవలం 1.4 కిలోల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. దీని ‘లూనా గ్రే’కలర్ ఫినిషింగ్ ల్యాప్‌ టాప్‌కు క్లాసీ లుక్‌ను ఇస్తుంది.ఆఫీస్‌కు వెళ్లే వారు లేదా కాలేజ్ స్టూడెంట్స్ తమ బ్యాగ్‌లో దీనిని ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లొచ్చు. దీని తయారీలో వాడిన మెటీరియల్ చాలా కూడా క్వాలిటీగా ఉండటం వల్ల ఇది ఎక్కువ రోజులు పాడవకుండా ఉటుంది.

డిస్‌ప్లే క్వాలిటీ:

Advertisement

ఈ లాప్‌ టాప్‌లో 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ యాంటీ గ్లేర్ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల ఎక్కువ గంటలు స్క్రీన్ ముందు కూర్చున్నా.. కళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి పడదు.ఆన్‌లైన్ క్లాసులు విన్నా,యూట్యూబ్‌లో సినిమాలు చూసినా లేదా ఆఫీస్ ప్రెజెంటేషన్లు తయారు చేసినా విజువల్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇండోర్, అవుట్‌డోర్ వాడకానికి ఈ డిస్‌ప్లే చాలా బాగా ఉపయోగ పడుతుంది.

ప్రాసెసర్, పెర్ఫార్మెన్స్:

ఈ డివైస్‌లో అత్యంత ముఖ్యమైన హైలైట్ దీని పవర్ ఫుల్ ప్రాసెసర్. ఇది Intel Core i5 13th Gen (13420H) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అంతే కాకుండా ఇది మల్టీటాస్కింగ్‌ను చాలా ఈజీ చేస్తుంది. ఒకేసారి అనేక ట్యాబ్స్‌ ఓపెన్ చేసినా.. హెవీ సాఫ్ట్‌వేర్ వాడినప్పటికీ లాప్‌టాప్ ఎక్కడా హ్యాంగ్ కాకుండా చాలా బాగా పని చేస్తుంది. ఆఫీస్ వర్క్, కోడింగ్, గ్రాఫిక్ వంటి పనులకు ఈ ప్రాసెసర్ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

రామ్ ,స్టోరేజ్:

Advertisement

బెస్ట్ పర్ఫామెన్స్ కోసం ఇందులో 8 GB DDR5 RAM, 512 GB SSD స్టోరేజ్ ఇవ్వబడ్డాయి. DDR5 రామ్ వల్ల పాత తరం రామ్‌లతో పోలిస్తే డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే 512 జీబీ ఎస్సెడీ కారణంగా ల్యాప్‌టాప్ కొన్ని సెకన్లలోనే క్విక్‌గా ఆన్ అవుతుంది. మనకు నచ్చిన ఫైల్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు, మూవీస్‌ను ఎలాంటి స్టోరేజ్ ఇబ్బంది లేకుండా ఉంచుకోవచ్చు.

ఆపరేటింగ్ సిస్టమ్, ప్రత్యేకతలు:

ఇది లేటెస్ట్ విండోస్ 11 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని వల్ల సిస్టమ్ సెక్యూరిటీ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు మెరుగ్గా ఉంటాయి. ఇందులో.. ప్రత్యేకంగా కోపైలట్ కీ ని అందించారు. దీని సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను మరింత వేగంగా యాక్సెస్ చేయవచ్చు. అలాగే దీనితో పాటు ఎంఎస్ ఆఫీస్ కూడా అందుబాటులో ఉండటం ఉద్యోగులకు, విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

Also Read: ఫోన్ వాడకున్నా ఛార్జింగ్ అయిపోతుందా? ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి!

కనెక్టివిటీ , బ్యాటరీ లైఫ్:

ఈ డివైస్‌లో రోజూవారీ అవసరానికి సరిపోయే అన్ని రకాల పోర్ట్స్ ఉన్నాయి. యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎంఐ పోర్ట్, టైప్-సి పోర్ట్ ద్వారా ఇతర పరికరాలను ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. వైఫై , బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో రోజంతా బ్యాకప్ వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది.

మార్కెట్లో ఈ మోడల్ లాప్‌టాప్ అసలు ధర సుమారు రూ.99,990 వరకు ఉండగా, ప్రస్తుతం వివిధ ఆఫర్ల ప్రకారం కేవలం రూ.59,880 ధరకే లభిస్తోంది. రూ.60వేల లోపు బడ్జెట్‌లో మంచి బ్రాండ్, లేటెస్ట్ ఫీచర్లు, అద్భుతమైన స్పీడ్ కోరుకునే వారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

Related News

ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల నుంచి టీవీల వరకు.. Flipkart Big Billion Days డేట్స్ వచ్చేశాయోచ్!

కొత్త ల్యాప్‌టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? Asus తెచ్చిన ఈ 5 మోడల్స్‌పై ఓ లుక్కేయండి!

65 ఇంచుల టీవీపై మతిపోయే ఆఫర్..వెంటనే కొనేయండి

ఫోన్ వాడకున్నా ఛార్జింగ్ అయిపోతుందా? ఈ 3 సెట్టింగ్స్ వెంటనే మార్చండి!

iPhone 18 Proలో లేనివి ఫోల్డబుల్‌లో ఎందుకు? యాపిల్ చేసిన ఈ 5 ప్రయోగాలు మైండ్ బ్లోయింగ్!

కీప్యాడ్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్లు అరుదే.. 2500mAh బ్యాటరీతో iTel Music 450L లాంచ్!

తెలివైన వాళ్ళు మాత్రమే..వాడే ఈ సేఫ్టీ మోడ్ గురించి మీకు తెలుసా?

Big Stories

Advertisement
×