Udaya Bhanu:సినిమా ఇండస్ట్రీలో హడావిడి చేస్తూ.. ఆధిపత్యం చెలాయించే వారిదే రాజ్యం అంటూ ఒకప్పటి అందాల తార ప్రముఖ సీనియర్ యాంకర్ ఉదయభాను (Udaya Bhanu) చేసిన కామెంట్లు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోయే వాళ్ళకి అవకాశాలు లభించేది తక్కువే అంటూ ఆమె చేసిన కామెంట్లు అందరిని ఆలోచింపచేస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీస్ కి వరుసగా అవకాశాలు రావడం వెనుక ఉన్న పీ.ఆర్ గేమ్స్ పై సంచలన కామెంట్లు చేసింది ఉదయభాను.
నిర్మాతగా మారి పంచనామా సీరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చి తొలి ప్రయత్నం లోనే సక్సెస్ అందుకున్న ఉదయభాను.. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటుంది. అందులో భాగంగానే దాదాపు కొన్నేళ్లుగా టీవీ షోలకు దూరంగా ఉన్న ఈమె.. అసలు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా వివరించింది. ఉదయభాను మాట్లాడుతూ.. “ఇప్పుడున్న పరిస్థితుల్లో టాలెంట్ కంటే పీఆర్(పబ్లిక్ రిలేషన్స్), సెల్ఫ్ ప్రమోషన్స్ ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఒక సినిమా ఈవెంట్ జరగాలన్నా.. ఒక షో జరగాలన్నా.. ఆ షో ఎవరికి దక్కాలి? అనే దాని వెనుక కూడా గట్టి పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేవలం తమకంటూ ఒక బలమైన పీఆర్ నెట్వర్క్ మెయింటేన్ చేస్తూ నిరంతరం హడావిడి చేసే వారే ఇప్పుడు ఎక్కువగా షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లను చేస్తున్నారు అంటూ ఉదయభాను కామెంట్లు చేసింది.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నడుస్తున్న వ్యవహారాలపై ఆమె స్పందించి కామెంట్లు చేసింది. అయితే ఈమె మాటలు విన్న కొంతమంది ప్రస్తుతం వరుస సినిమా ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్ ల, సెలబ్రిటీ ప్రోగ్రామ్ లతో ఎక్కడ చూసినా కనిపిస్తూ.. బుల్లితెరను శాసిస్తున్న కొంతమంది టాప్ యాంకర్లను ఉద్దేశించి ఉదయభాను ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసి ఉంటుంది అంటూ నెటిజన్స్ జోరుగా చర్చిస్తున్నారు.
ALSO READ:పిల్లలు పుట్టాక మీ భార్యలను వదిలేస్తారా? మాధవీలత ఘాటు వ్యాఖ్యలు
ఉదయభాను చేసిన మాటల్లో నిజం ఎంత? అనే విషయం కూడా ఇప్పుడు చర్చకు దారి తీసింది. కొంతమంది గతంలో ఈమెకు వరుస అవకాశాలు వచ్చాయి.. ఇప్పుడు రావట్లేదు ఎందుకు ? అనే కోణంలో ఆరా తీయగా.. ప్రస్తుత పరిస్థితులు అర్థం అవుతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడున్న గజిబిజి లైఫ్ స్టైల్ లో ప్రతిభను వెతుక్కుంటూ వెళ్ళేంత టైమ్ అటు దర్శక నిర్మాతలకు కానీ ఇటు మేనేజర్లకు గానీ లేదు. అందుకే ఎవరైతే తమను తాము సెల్ఫ్ ప్రమోట్ చేసుకుంటూ, లైమ్ లైట్ లో ఉంటున్నారో వాళ్ళకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.. అలా చేసుకోవడం ఇప్పుడు పార్ట్ ఆఫ్ గేమ్.. మొత్తానికి అయితే ఉదయభాను చెప్పిన మాటలు అక్షరాల నిజం అనే కామెంట్ వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా సరే అవకాశం రావాలి అంటే మనం వెతకాలే తప్ప మన వద్దకు అవకాశం రావాలి అని కోరుకోకూడదు. ప్రయత్నం లేనిది ఏది దొరకదు.. ఎందుకంటే దర్శకనిర్మాతలు ఎవరైనా సరే ఇప్పుడు ట్రెండ్ లో ఎవరున్నారు.. ఎవరి చేత షో చేస్తే టిఆర్పి రేటింగ్ పెరుగుతుంది.. జనాలు చూస్తారు అనేదే పరిశీలిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సెల్ఫ్ ప్రమోషన్ కెరియర్ అభివృద్ధికి మంచిదే అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.