BigTV English

Sarvepalli Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. సర్వేపల్లిలో ఎవరి సత్తా ఎంత ?

Sarvepalli Assembly Constituency : బిగ్ టీవీ ఎలక్షన్ సర్వే.. సర్వేపల్లిలో ఎవరి సత్తా ఎంత ?

Sarvepalli Assembly Constituency : ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు డైలాగ్ వార్ తో హీట్ పుట్టించే నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది సర్వేపల్లి. ఇక్కడ పాలిటిక్స్ కాకాణి వర్సెస్ సోమిరెడ్డిగా ఉంటూ వస్తోంది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తుంటాయి. నువ్వా నేనా అన్నట్లు రాజకీయం రంజుగా సాగుతుంటుంది. ఈసారి కూడా గరంగరం పాలిటిక్స్ కు కేరాఫ్ గా సర్వేపల్లి మారిపోయింది. రాజకీయంగా ఆధిపత్యం సాధించేందుకు ఎన్నికలతో సంబంధం లేకుండా వైసీపీ, టీడీపీ కీలకనేతలైన కాకాణి, సోమిరెడ్డి పోటీ పడుతుంటారు. ఇక అసలు సిసలైన సమరం వచ్చిందంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.


ఇప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఇంకా రాకపోయినా సర్వేపల్లి రాజకీయం గరంగరంగా మారిపోయింది. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పూర్వీకులు ఉన్న ప్రాంతం ఇదే. అలాగే ఫేమస్ కృష్ణపట్నం పోర్ట్ ఉన్నది ఈ సెగ్మెంట్ లోనే. ఈ సెగ్మెంట్ లో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ తమ ప్రభావం చూపుతూ వస్తున్నాయి. మరి ఇప్పుడు సర్వేపల్లి నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు 2019 అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం.


2019 RESULTS
కాకాణి గోవర్ధన్ రెడ్డి VS సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

సర్వేపల్లిలో గత రెండు టర్మ్ ల నుంచి పోటీ వైసీపీ వర్సెస్ టీడీపీ ద్విముఖపోరుగా మారిపోయింది. 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కాకాణి గోవర్దన్ రెడ్డి 51 శాతం ఓట్లతో గెలిచారు. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 44 శాతం ఓట్లు సాధించారు. ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చాయి. గత రెండు టర్మ్ లుగా కాకాణి ఇక్కడ గెలుస్తూ వస్తున్నారు. జగన్ వేవ్ తో గత ఎన్నికల్లో సర్వేపల్లి వైసీపీ వశమైంది. 2014లోనూ సోమిరెడ్డి ఓడిపోవడంతో టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించింది. మరి ఈసారి ఎన్నికల్లో సర్వేపల్లి సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్‌ టీవీ ఎక్స్‌క్లూజివ్‌ డీటెయిల్డ్‌ ఎలక్షన్‌ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

కాకాణి గోవర్ధన్ రెడ్డి (YCP) ప్లస్ పాయింట్స్

వైసీపీలో బలమైన నేతగా గుర్తింపు
సర్వేపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనులు
నియోజకవర్గంలో క్యాడర్ ఫుల్ సపోర్ట్
ప్రజల్లో కాకాణికి పాజిటివ్ ఇమేజ్
ప్రచారంలో ఇప్పటి నుంచే స్పీడ్ పెంచడం
ఫిషింగ్ జెట్టీ, కాజ్ వే ఏర్పాటవడం
ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు పెరగడం
తాగునీటి సమస్యను తీర్చడం

కాకాణి గోవర్ధన్ రెడ్డి మైనస్ పాయింట్స్

సెగ్మెంట్ లోని కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగా లేకపోవడం
పరిశ్రమల కారణంగా ముత్కూరు, తోటపల్లిగూడూర్ మండలాల్లో అనారోగ్య సమస్యలు

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP) ప్లస్ పాయింట్స్

టీడీపీలో కీలక నేతగా గుర్తింపు
వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్న సానుభూతి
నియోజకవర్గ అభివృద్ధి కోసం ముందుండడం
అధికార పక్షాన్ని నిలదీస్తుండడం
జనసేనతో పొత్తు ఓట్ షేర్ పెంచే ఛాన్స్

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైనస్ పాయింట్స్

బలమైన ప్రత్యర్థిని ఎంత వరకు ఢీకొంటారన్న డౌట్లు

ఇక వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం.

కాకాణి గోవర్ధన్ రెడ్డి VS సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఇప్పటికిప్పుడు సర్వేపల్లిలో ఎన్నికలు జరిగితే కాస్తంత వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డికి 49 శాతం ఓట్లు, టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి 46 శాతం ఓట్లు, ఇతరులకు 5 శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తేలింది. అయితే ఇది ఇప్పటి సమీకరణాల ప్రకారమే. కానీ ఎన్నికల నాటికి సర్వే పల్లి రాజకీయం మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు ఎఫెక్ట్, టీడీపీ వేవ్, జనసేన పొత్తుల వ్యవహారం మరింతగా వర్కవుట్ అయితే పరిస్థితులు ఎటువైపైనా ఉండే అవకాశం కనిపిస్తోంది. నిజానికి ఈ సర్వేపల్లి సెగ్మెంట్ 2009 కి ముందు కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత ఆ ఓటు బ్యాంకు అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయింది. అదే పోల్ సినారియో ప్రతి ఎన్నికల్లో కనిపిస్తోంది.

కాకాణి గోవర్దన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు ఎన్నికల్లో కీలకంగా పని చేయబోతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఫిషింగ్ జెట్టీ, కాజ్ వే లాంటి పనులు ఉపయోగపడనున్నాయి. అయితే ఇసుక, మట్టి వ్యాపారాల్లో జోక్యం, ఇతర ఆరోపణలు ఎన్నికల్లో ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే టీడీపీకి ఓట్ షేర్ రావడంలో సోమిరెడ్డి వ్యక్తిగత ఇమేజ్, టీడీపీ బలం, బలగం కారణమవుతున్నాయి. అధికార పార్టీని, సెగ్మెంట్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేను ప్రతి సందర్భంలో గట్టిగా నిలదీయడం సోమిరెడ్డికి ప్లస్ అవుతున్నాయి. అలాగే 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోవడం కూడా జనంలో సానుభూతిని పెంచి చివరి నిమిషంలో ఈసారి గట్టెక్కిస్తాయన్న చర్చ సెగ్మెంట్ లో వినిపిస్తోంది.

Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×