BigTV English

Hindu Marriage : పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక ఇంత అర్థం ఉందా..!

Hindu Marriage : పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టడం వెనుక ఇంత అర్థం ఉందా..!

Hindu Marriage : ఇప్పుడంటే అమ్మాయి, అబ్బాయి పెళ్లి చూపులు అయినప్పటీ నుంచి మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు అయితే మాట్లాడుకోవడం కాదు కాదా.. కనీసం చూసేవారు కూడా కాదు. ఫలానా వాళ్ల అబ్బాయికి అమ్మాయికి పెళ్లి కుదిరింది అంటే.. వధూవరులు ఒకరినొకరు పెళ్లిపీటలపైనే చూసుకునేవారు. అప్పటి వరకూ మాటలు కాదు కదా.. కనీసం చూపులు కూడా ఉండవు. పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా నిర్వహించుకుంటారు.


పెళ్లిలో నిర్వహించే ఒక్కో కార్యక్రమం పెళ్లి చేసుకోబోయే జంట జీవితాలతో ముడిపడి ఉంటుంది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా నిర్వహించేవారు. అందుకే పెళ్లి పనులు ప్రారంభం నుంచి ముగింపు వరకు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పెళ్లిలో అతి ముఖ్యమైన కార్యక్రమం జీలకర్ర, బెల్లం ఒకరి తలపై మరొకరు పెట్టడం. ఇలా పెట్టడంతో దాదాపు సగం పెళ్లి పూర్తయినట్లుగా భావిస్తారు. అయితే ఇలా జీలకర్ర బెల్లం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా..?

 


Hindu Marriage
Hindu Marriage 

ఒకప్పుడు పెళ్లి చేసుకుబోయే వారు ఒకరి మొహాలు ఒకరు చూసుకునేవారు కాదు. పెద్దలు ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారు. మండపంలోనూ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు మధ్యలో వస్త్రాన్ని పట్టుకుని నిల్చుంటారు. జీలకర్ర-బెల్లం పెట్టిన తర్వాతనే వస్త్రాన్ని తొలగిస్తారు.

ఈ సమయంలో ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూడాలని చెబుతూ వస్త్రాన్ని తొలిగిస్తారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్పర్శ, చూపు శుభప్రదంగా ఉండేందుకు ఈ నియమం పెట్టారు. అప్పటి వరకు శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతను తొలగించడానికి దీనిని ఇలా పెడతారు.

Hindu Marriage
Hindu Marriage

జీలకర్ర, బెల్లానికి వేర్వేరు లక్షణాలు ఉంటాయి. బెల్లం కరిగిపోయే గుణం కలిగి ఉంటుంది. జీలకర్ర తన రూపంలో ఎటువంటి మార్పు లేకుండా అంటిపెట్టుకుని ఉంటుంది. ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్థిత్వాన్ని వారు నిలుపుకోవాలనీ.. ఈ రెండు పదార్థాల కలయిక వెనుకున్న అర్థం.

వైద్యశాస్త్రం ప్రకారం.. జీలకర్ర, బెల్లం కలిపి తీసుకుంటే ఎన్నో రకాల సమస్యలు తీరిపోతాయట. ఒంటికి చలవచేయడం, రక్తహీనతని తగ్గించడంలో జీలకర్ర- బెల్లం ప్రధానపాత్ర పోషిస్తాయి. భార్య, భర్త ఇద్దరు ఎలాంటి సమస్యను అయినా అధిగమించాలనే సూచన ఇందులో ఉంది. జీలకర్ర, బెల్లం కలిపి ఉంచడం వల్ల శక్తి ఉద్భవిస్తుందని కొందరు నమ్ముతారు. అంతేకాకుండా మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలను మేల్కోలిపే ప్రయత్నంలో జీలకర్ర, బెల్లం పెడతారు. యోగశాస్త్రం ప్రకారం ఈ ఘట్టాన్ని నిర్వహిస్తారు. ఇలా ఏర్పడిన అనుబంధం జీవితకాలం నిల్చిపోతుందని నమ్మకం.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×