E-Paper
Advertisement

ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాట్ కామెంట్స్.. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది? వ్యాఖ్యల వెనుక

ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాట్ కామెంట్స్.. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది? వ్యాఖ్యల వెనుక
Advertisement

Kadapa: ఏపీలోని కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హాట్ కామెంట్స్ వెనుక అసలు కథేంటి? కార్యకర్తల ముందు ఎందుకు ఆ విధంగా అన్నారు? కార్యకర్తల కోసం రాజీనామాకు సిద్ధమని ప్రకటన చేశారు. వెనుక అసలు జరిగింది.. జరుగుతున్నదేంటి?

ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాట్ కామెంట్స్

Advertisement

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ‌రెడ్డి వార్తల్లోకి వచ్చారు. ఏం జరిగిందో తెలీదుగానీ కూటమి ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తోందని వ్యాఖ్యానించారు. అవసరమైతే కార్యకర్తల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా తాను సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు.

సోమవారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జమ్మలమడుగులో ‘మన ఊరు -మన జెండా’ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం కంటే కార్యకర్తలు ముఖ్యమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు.

Advertisement

కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది? రాజీనామాకు సిద్ధమంటూ వ్యాఖ్యలు

రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మెజార్టీ సీట్లను బీజేపీకి దక్కేలా ప్రయత్నం చేస్తానన్నారు. కడప జిల్లా జెడ్పీ ఛైర్మన్ పీఠం పార్టీకి దక్కేలా గట్టిగా పోరాడుతానని కుండబద్దలు కొట్టేశారు. గండికోట, రాజోలి ఎస్ఆర్బీసీ కెనాల్, ఆర్టీపీపీ ప్లాంట్ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తున్నానని అన్నారు. తాను భావించినట్టు వ్యవస్థ సరిగా లేకుంటే పార్టీలో ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారు.

తాను మంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. అన్ని పనులు కచ్చితంగా జరగాలని తేల్చేశారాయన. అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇస్తున్నారని, తన నియోజకవర్గానికి రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను చేస్తున్న డిమాండ్ల లో ఏ మాత్రం తేడా వచ్చినా పదవి కంటే కార్యకర్తలే ముఖ్యమన్నారు. మంచి చేయకుంటే పార్టీ బలపడదని తేల్చేశారాయన.

ALSO READ: తిరుమల శ్రీవారి హుండీలో పాత నోట్ల కట్టలు.. ఏకంగా రూ.400 కోట్లు

నియోజకవర్గంలో సమస్యలను అన్ని విభాగాల అధికారులను కలిశానని వివరించారు. ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలపై ప్రత్యర్థి పార్టీలు ఆయన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాయి.  తన పోరాటం నియోజకవర్గంలో సమస్యపైనని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×