Vishnu Kumar Sensational Comments: విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఉండదని మనసులోని మాట బయటపెట్టారు. పార్టీ లేకుంటే వైసీపీకి కష్టకాలం ఎక్కడి నుంచి ఉంటుందన్నారు.
విశాఖలో శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ ఉండదని, వైనాట్ 175 అన్నరోజునే ఆ పార్టీ పోయిందన్నారు. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, కొత్త పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేయకపోతే ఉన్నవాళ్లు బయటకు వెళ్ళిపోతారన్నారు. అందుకే ఇప్పుడు ఆ పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తుందన్నారు.
వైసీపీ నేతలు, నాయకులు మంచివాళ్ళు ఉన్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే. వైసీపీ నాయకులంతా ఇప్పుడు జీరోగా మారిపోయారన్నారు. వైసీపీలో నాయకులు అనవసరమన్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఆ పార్టీ అధికారంలోకి రాదని తేల్చేశారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి చాలా మంచి పని చేశారన్నారు విష్ణుకుమార్ రాజు. అవంతి మాటలు వింటుంటే పవన్‌పై ప్రేమ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందన్నారు. ఆయన డైరెక్షన్ అటు వైపు చూస్తుందన్నారు. అవంతి శ్రీనివాస్ ఏ రోజు బీజేపీపై విమర్శలు చేయలేదని, మా పార్టీలోకి వస్తే తప్పేముందన్నారు. అవంతి మర్డర్ చేయలేదు అలాగని బియ్యం అమ్ముకోలేదన్నారు.
ALSO READ: జగన్ బెయిల్ రద్దు వ్యవహారం.. జనవరి 10న తేల్చేయడం ఖాయం?
అవంతి మంత్రి పదవి పోవడానికి కీలక కారణం చెప్పారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో ఫ్లెక్సీలపై జగన్‌తోపాటు అవంతి ఫోటో వేసుకోవడమే కారణంగా చెప్పుకొచ్చారు. అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి పోతుందని తాను అప్పుడే అనుకున్నానని వెల్లడించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఫ్లెక్సీ మీద మంత్రి ఫోటోను చూడలేదన్నారు. చివరకు బొత్స సత్యనారాయణ ఫోటో కూడా లేదన్నారు.