BigTV English

White Hair: క్షణాల్లో మీ తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ ఒక్క పని చేయండి..!

White Hair: క్షణాల్లో మీ తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ ఒక్క పని చేయండి..!

White Hair: ప్రస్తుత రోజుల్లో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తెల్ల జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కొంత మందికి వంశపార్యపరంగా తెల్ల జుట్టు వస్తే.. మరి కొంత మందికి దుమ్మూ, కాలుష్యం, పోషకాహారం తినకపోవడం, స్ట్రెస్ కారణంగా జుట్టు తొందరగా తెల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం చాలా మంది తెల్లజుట్టును కవర్ చేసేందుకు హెన్నా లేదా బయట దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు.


వీటివల్ల ప్రయేజనం ఉంటుందో లేదో పక్కన పెడితే.. జుట్టుకు హానీ కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే నాచురల్ పదార్ధాలతో హెయిర్ కలర్ సిద్ధం చేసుకున్నారంటే 10 నిమిషాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారుతుంది. పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్దాలు..
మెంతులు
బ్లాక్ సీడ్స్
బాదం పప్పులు
ఉసిరి పొడి
నువ్వుల నూనె


తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి.. మెంతులు, బ్లాక్ సీడ్స్, ఐదు బాదం పప్పులు, ఉసిరి పొడి వేసి బాగా నల్లగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పొడి చేయండి. నువ్వుల నూనెలో ఈ మిశ్రమాన్ని కలిపి మిక్స్ చేయండి. దీన్ని గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ ఆయిల్‌ను జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. క్రమంగా తెల్లజుట్టు తగ్గిపోతుంది. దీంతో పాటు జుట్టు పొడవుగా పెరిగేందుకు సహాయపడుతుంది. చుండ్రును నివారిస్తుంది.

తెల్లజుట్టు నివారణకు మరొక చిట్కా..
ముందుగా ఒక గిన్నెలో టీపొడి తీసుకుని అందులో అర గ్లాసు నీళ్లు పోసి.. స్టవ్ మీద పెట్టి మరిగించండి.. ఆరిన తర్వాత టీ పొడిని వడకట్టి.. ఆ వాటర్‌లో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ నిమ్మరసం కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట సేపు ఉంచి.. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. టీ పొడిలో టానిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది.

Also Read: మీ జీవిత భాగస్వామి.. మీతో నిజాయితీగా ఉంటున్నారో లేదో ఇలా తెలుసుకోండి, అదిరిపోయే టిప్!

తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు కలబంద, కొబ్బరి నూనె
తెల్లజుట్టు నల్లగా మార్చేందుకు.. ముందుగా ఒక గిన్నెలో కలబంద జెల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, రెండు టేబుల్ స్పూన్ గోరింటాకు పొడి వేసి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి.. గంట తర్వాత తలస్నానం చెయ్యండి. క్రమంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. వీటిలో వాడే పదార్ధాలు జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడతాయి.

 

 

 

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×