BigTV English

Brother anilkumar comments: లైన్‌లోకి బ్రదర్ అనిల్, సెటైర్లు ఎవరిపై?

Brother anilkumar comments: లైన్‌లోకి బ్రదర్ అనిల్, సెటైర్లు ఎవరిపై?

Brother anilkumar comments: రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరంటారు. దగ్గరవాళ్లు కూడా దూరమైపోతారు. అందుకే దాన్ని రాజకీయమన్నారు. అయితే నేతలు తమ మాటలను అవసరానికి అనుకూలంగా మలచుకుంటారు. అందులో వీరిది అందె వేసిన చేయి. నిన్నటివరకు బంధువులుగా ఉన్నవారు ఒక్కసారిగా ప్రత్యర్థులుగా మారిపోయారు. అంతేకాదు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు.


తాజాగా బ్రదర్ అనిల్‌కుమార్ ఇన్‌డైరెక్ట్‌గా జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాపాలు చేసినవారిని తొక్కి పడేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా పాపాలను తరిమి కొట్టేందుకు ప్రార్థన ఒక్కటే సరిపోదని, ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. తాము న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని, ఎవరికీ భయపడవద్దని దేవుడు అండగా ఉంటారన్నారు. ఆయనపై విశ్వాసం ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు. కడపలోని రాజారెడ్డి వీధిలోని ఉన్న ఓ చర్చిలో బ్రదర్ అనిల్‌కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బ్రదర్ అనిల్ మాటలపై అధికార-విపక్షాల నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టేశారు. ముమ్మాటికీ జగన్‌‌ను బ్రదర్ అనిల్‌కుమార్ టార్గెట్ చేశారని, ఇన్‌డైరెక్ట్‌‌గా ఆయన భాషలోనే చెప్పారని అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. వైసీపీ నేతలైతే మరో విధంగా మాట్లాడుకోవడం కనిపించింది. జగన్-బ్రదర్ అనిల్ కుమార్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, నేరుగా ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెట్టుకున్న సందర్భాలు లేవని అంటున్నారు.


ALSO READ: పొన్నవోలు టాలెంట్ అదే, జగన్ క్విడ్ ప్రోకో!

జగన్- వైఎస్ షర్మిల మధ్య కొంత గ్యాప్ ఉందని, అంత మాత్రాన బ్రదర్ అనిల్ ఏమైనా అంటే ఒప్పుకుంటారా అని మాట్లాడుకోవడం కనిపించింది. మొత్తానికి బ్రదర్ అనిల్‌కుమార్ మాటలపై పొలిటికల్ సర్కిల్స్‌లో చిన్నపాటి చర్చ జరుగుతోంది.

Related News

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Big Stories

×