BigTV English

Byreddy VS Katasani: పాణ్యం వైసీపీలో ముదురుతున్న ఆధిపత్యపోరు.. బైరెడ్డి VS కాటసాని

Byreddy VS Katasani: పాణ్యం వైసీపీలో ముదురుతున్న ఆధిపత్యపోరు.. బైరెడ్డి VS కాటసాని

Byreddy VS Katasani: అక్కడ అధికారపక్షంలో సీనియర్ వర్సెస్ జూనియర్ నేతల మధ్య ఆధిపత్యపోరు పీక్ స్టేజ్‌కి చేరింది. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనే పరిస్థితి కనిపిస్తోంది. ఆ యువ నాయకుడి పేరు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కరలేని పేరు.. సోషల్ మీడియాలో తనకంటూ ఇమేజ్ సంపాదించున్న నేత ఆయన.. సదరు సీనియర్ నాయకుడు 6సార్లు ఎమ్మెల్యే గా పనిచేశారు.. ఎమ్మెల్యేగా నిత్యం వివాదాలతో నలుగుతుండే ఆయన అరాచకాలపై పెద్దఎత్తున ప్రచారం చేస్తూ ఢీ అంటే ఢీ అంటున్నారు ఆ యంగ్ లీడర్.. ఆ క్రమంలో ఆ ఎమ్మెల్యే సీటు ఈ సారి తనకే కావాలంటూ అధిష్టనంపై ఒత్తిడి తెస్తున్నారంట .. మరోవైపు వైసీపీ అధిష్టానం పలువురు సిట్టింగులను మారుస్తామని చెప్తుండటంతో ఆ సీనియర్ ఎమ్మెల్యేలో గుబులు రేగుతోందంట.


ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయనకు మంద్రి పదవి మాత్రం దక్కలేదు. జగన్ క్యాబినెట్లో తనకు ఒక పదవి ఉంటుందని ఆశించినప్పటికీ.. ఆయన సీనియార్టీ వర్కౌట్ కాలేదు. పాణ్యం సెగ్మెంట్ అంటే కాటసాని అన్న బ్రాండ్ సంపాదించుకున్నప్పటికీ.. అమాత్య పదవి మాత్రం ఆయనకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. అదలా ఉంటే తన నియోజకవర్గంలో భూదందాలు, సెటిల్మెంట్లు, బెదిరింపులు వంటి వివాదాలతో ఎప్పుడు వార్తల్లోనే ఉంటారాయన.

ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాకే చెందిన వైసీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కన్ను ఇప్పుడు పాణ్యం సెగ్మెంట్‌పై పడింది. ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్న సిద్దార్ధరెడ్డి పాణ్యం నుంచి పోటీకి గ్రౌండ్ వర్క్‌ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యూత్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నందికొట్కూరు సొంత నియోజకవర్గం అయినప్పటికీ .. అది ఎస్సీ రిజర్వుడు కావడంతో పాణ్యం వైపు చూస్తున్నారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డిని వైసీపీ అధిష్టానం ఎంపీగా బరిలో నిలుపుతుందనే ప్రచారంతో.. పాణ్యం టికెట్ కోసం బైరెడ్డి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.


కాటసాని రాంభూపాల్ రెడ్డి ఒకవేళ నంద్యాల ఎంపీగా పోటీ చేయాల్సి వస్తే.. పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ తన కుమారుడు కాటసాని నరసింహారెడ్డికి కేటాయించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారంటున్నారు. అయితే ఆయన కొడుకు ఇప్పటిదాకా ప్రజల్లో తిరగకపోవడం మైనస్‌గా కనిపిస్తోందంటున్నారు. ఈ నేపధ్యంలో తాను ఎట్టి పరిస్థితుల్లో పాణ్యం నుంచి పోటీ చేస్తానని.. అందులో ఎలాంటి సందేహం లేదని కాటసాని రాంభూపాల్ రెడ్డి అంటున్నారు. తాను నంద్యాల ఎంపీగా.. లేకపోతే ఇతర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు.

ఏదేమైనా బైరెడ్డి, కాటసాని వర్గాల మధ్య విభేదాలు మాత్రం తరాస్థాయి చేరుతున్నాయి. వారి అనుచరులు తమ నాయకులకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోటాపోటీగా పోస్టులు పెడుతున్నారు. ప్రత్యర్ధి వర్గంపై అభ్యంతరకర పదజాలంతో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఆ క్రమంలో ఇటీవల సిద్ధార్థ రెడ్డిపై అభ్యంతరకర పదజాలంతో పెట్టిన పోస్టింగ్ మరో వివాదానికి దారితీసింది. దానికి కౌంటర్‌గా కాటసాని రాంభూపాల్ రెడ్డిని మరింత తీవ్రమైన పదజాలంతో నిందిస్తూ బైరెడ్డి వర్గం పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.. ప్రతి ఊర్లో కాటసాని బాధితులని కలుస్తామని .. ఆయన అక్రమాలను రోజుకొకటి వెలుగులోకి తెస్తామని ఆ పోస్టులో హెచ్చరించారు బైరెడ్డి వర్గీయులు.

గతంలో నందికొట్కూరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని తాను ఉన్నంతవరకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా అని ప్రకటించారు సీఎం జగన్ .. దానికి తగ్గట్లే సిద్దార్థరెడ్డికి రాష్ట్ర యువజన నాయకుడితో పాటు శాప్ చైర్మన్ ని కూడా కట్టబెట్టారు. అలా ప్రాధాన్యత కల్పించిన క్రమంలోనే పాణ్యం టికెట్‌పై ఆశలు పెంచుకుని దూకుడు పెంచారంట ఆయన .. అయితే టికెట్ విషయంలో వైసిపీ బైరెడ్డిని పక్కన పెడితే .. ఆయన పార్టీ మారే అవకాశముందా? అన్న అంశంపై స్థానికంగా చర్చ మొదలైంది. ఒకవేళ సిద్దార్థరెడ్డికే పాణ్యం వైసీపీ టికెట్ ఇస్తే కాటసాని వర్గం ఆయనకు ఎంత వరకు సహకరిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి పాణ్యం వైసీపీ రాజకీయం ఇప్పుడు హాట్ హాట్‌గా తయారైంది.

.

.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×