BigTV English

Nara Lokesh : ప్రజా దర్బార్ లో వెల్లువెత్తిన వినతులు.. మంత్రికి క్యాబ్ డ్రైవర్ల రిక్వెస్ట్

Nara Lokesh : ప్రజా దర్బార్ లో వెల్లువెత్తిన వినతులు.. మంత్రికి క్యాబ్ డ్రైవర్ల రిక్వెస్ట్

Cab Drivers Request to Minister Lokesh(AP news live): తెలంగాణ ప్రభుత్వం తమపై విధించిన నిబంధనలను తొలగించేలా చూడాలని ఏపీ క్యాబ్ డ్రైవర్లు మంత్రి నారా లోకేశ్ కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం మంత్రి నారా లోకేశ్ నిర్వహించిన ప్రజాదర్బార్ లో క్యాబ్ డ్రైవర్లు ఆయన్ను కలిశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలం ముగియడంతో.. తమ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ చెల్లించాలని తెలంగాణ అధికారులు చెబుతున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో తాము లైఫ్ ట్యాక్స్ కట్టామని, మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టే స్తోమత లేదని వివరించారు. ఏపీ వాహనాలపై హైదరాబాద్ అధికారులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కాగా.. ఈ నెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల సీఎం లు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ కానున్న నేపథ్యంలో క్యాబ్ డ్రైవర్లు తమ సమస్యలను కూడా పరిష్కరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ క్యాబ్ లకు హైదరాబాద్ లో మరికొంతకాలం పాటు లైఫ్ ట్యాక్స్ లేకుండా ఉండేలా ఊరటనిచ్చేలా అక్కడి వారితో మాట్లాడాలని కోరారు.

Also Read : ఏపీలో వాలంటీర్లు కొనసాగుతారా ? డిప్యూటీ సీఎం మాటల్లో ఆంతర్యమేమిటి ?


మంగళగిరిలో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కు అనూహ్యమైన స్పందన వస్తుందన్నారు నారా లోకేశ్. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ప్రజాదర్బార్ కు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారని తెలిపారు. ఉండవల్లిలో తనను కలిసి వినతులను అందజేస్తున్నారని, ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత సిబ్బందిని అక్కడకక్కడే ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రజాదర్బార్ లో తమ సమస్యలకు తక్షణమే పరిష్కారమార్గం లభిస్తుండటంతో.. సామాన్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని లోకేశ్ పేర్కొన్నారు.

కాగా.. కావలిలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంపై విద్యాశాఖమంత్రి నారా లోకేశ్ స్పందించారు. కావలి ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని X వేదికగా ట్వీట్ చేశారు. బస్సుప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయాలపాలైన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. స్కూళ్ల యాజమాన్యాలు అన్ని బస్సుల కండీషన్ ను చెక్ చేయించుకోవాలి, ఫిట్ నెస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×