E-Paper
Advertisement

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్: సీఎం చంద్రబాబు

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే కందిపప్పు, పామాయిల్: సీఎం చంద్రబాబు
Advertisement

Chandrababu Naidu: నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ ఏపీ ప్రభుత్వం సామాన్యులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం పడకుండా చూసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ధరల నియంత్రణకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

రేషన్ షాపుల్లో తక్కువ ధరకే సరుకులు

Advertisement

డిసెంబర్ మొదటి వారం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్ దుకాణాల ద్వారా రాయితీపై నిత్యావసరాలను అందించాలని సీఎం స్పష్టం చేశారు. దీని ప్రకారం, బయట మార్కెట్‌తో పోలిస్తే చాలా తక్కువగా కిలో కందిపప్పును రూ.100కే, లీటరు పామాయిల్‌ను రూ.125కే ప్రజలకు విక్రయించనున్నారు. అంతేకాకుండా, సామాన్యులకు బియ్యం అందుబాటులో ఉండేలా ప్రస్తుతం ఉన్న 286 ధరణి బియ్యం విక్రయ కేంద్రాలను ఏకంగా 500కు పెంచాలని అధికారులకు సూచించారు.

బ్లాక్ మార్కెట్‌పై ఉక్కుపాదం

Advertisement

కృత్రిమ కొరత సృష్టించి, సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిపై నిఘా పెంచాలని చంద్రబాబు ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై ఎలాంటి మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ నిర్ణయాలతో రానున్న రోజుల్లో సామాన్యుల వంటింటి బడ్జెట్‌కు కాస్త ఉపశమనం లభించనుంది.

Also Read: పౌల్ట్రీ పరిశ్రమకు గుడ్ న్యూస్.. ఫ్యూచర్ సిటీలో కీలక ప్రాజెక్టుకు సీఎం గ్రీన్ సిగ్నల్!

Tags

Related News

జగనే కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడిచారు.. వైసీపీ నేతలు తెలుసుకోవాలి: విజయసాయిరెడ్డి

ఏపీ పంచాయతీ ఎన్నికలు.. ఓటర్లకు ఈసారి ఆ వేలుపై సిరా గుర్తు.. ఎస్ఈసీ కీలక ఆదేశాలు!

బ్యాలెట్‌పై నోటా ఉన్నప్పుడు ఏకగ్రీవం ఎలా సాధ్యం? ఏపీ హైకోర్టు సంచలన ప్రశ్న!

ఇసుక మాఫియా ఆగడాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం.. ఉపేక్షించేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్!

మేనకోడలు పెళ్లికి దూరంగా జగన్! నిన్న విజయవాడకు రాక, పెళ్లి తర్వాత అసలు వ్యవహారాలు బయటకు..

అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం.. అదుపు తప్పి పలు వాహనాలను ఢీ కొట్టింది. విశాఖ సిటీలో ఘటన

నెల్లూరు రేణిగుంట ఆలయంపై.. కాక రేపుతున్న రాజకీయం

Big Stories

Advertisement
×