E-Paper
Advertisement

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!

ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!
Advertisement

Jr.NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అయి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ప్రశాంత్ నీల్(prashanth neel) దర్శకత్వంలో డ్రాగన్ (Dragon)అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ చేతికి సర్జరీ చేయడంతో విశ్రాంతి తీసుకున్నారు ఇటీవలే ఈయన సినిమా షూటింగ్లోకి అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇలా వరుస సినిమా పనులలో ఎన్టీఆర్ ఎంతో బిజీగా ఉన్నారు.

ఎన్టీఆర్ కు తోట వైకుంఠం ప్రత్యేక కానుక..

ఇలా సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉంటూనే తారక్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు అయితే తాజాగా ప్రముఖ కళాకారుడు తోట వైకుంఠం(thota vaikuntam) గారితో కలిసి దిగిన ఫోటోలను ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇకపోతే తోట వైకుంఠం గారు స్వయంగా తన స్వహస్తాలతో గీసిన ఒక కళాఖండాన్ని ఎన్టీఆర్ కు కానుకగా అందజేశారు. ఎన్టీఆర్ కోసం తన ప్రత్యేకమైన శైలిలో ఈ పెయింటింగ్ రూపొందించిన తోట వైకుంఠం స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరి ఈ కానుకను అందజేశారు.

సీతారాముల పట్టాభిషేకం

Advertisement

ఈ పెయింటింగ్ చూస్తుంటే మాత్రం గ్రామీణ నేపథ్యంలో సీతారాముల పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ పెయింటింగ్లో ఆంజనేయ స్వామితో పాటు భక్తులు కూడా పూజలు చేస్తున్నట్లుగా ఈ చిత్రాన్ని గీశారు. నేలపై సాంప్రదాయ ముగ్గులతో తోట వైకుంఠం తనదైన విలక్షణమైన శైలిలో దీనిని తీర్చిదిద్దారు. ఇలా ఆయన గీసిన ఈ అద్భుతమైన పెయింటింగ్ ను స్వయంగా తానే ఎన్టీఆర్ ఇంటికి తీసుకెళ్లి మరి ఎన్టీఆర్ కు అందజేశారు. ఈ పెయింటింగ్ చూసిన ఎన్టీఆర్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఈ పెయింటింగ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు.

Advertisement

ఇలా తోట వైకుంఠం గారితో కలిసి దిగిన ఫోటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..లెజెండరీ తోట వైకుంఠం గారి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ ఒరిజినల్ కళాఖండాన్ని ఇంటికి తీసుకురావడం ఎంతో ఆనందంగా, కృతజ్ఞతతో కూడిన క్షణం అంటూ తారక్ తన సంతోషాన్ని వ్యక్తపరిస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్న తారక్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో చేయబోతున్నారు. ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడితో కూడా సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: ఇంటింటి రామాయణం పల్లవి సీరియల్స్ చేయక ముందు ఏం చేసేవారో తెలుసా?

Related News

చూపు తిప్పుకోనివ్వని మహిమా..ఈ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తుందేంటి బాసూ!

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

Big Stories

Advertisement
×