Bengaluru: ఎన్ని విభేదాలున్నా వివాహం అనే సరికి అందరూ కలుస్తారు. అప్పటివరకు ఉన్న విభేదాలను పక్కనపెడతాము. మంచి మనసుతో నూతన దంపతులు జీవింతాలని మంచి మనస్సుతో దీవిస్తాము. ఈ విషయంలో జగన్ రూటు సెపరేట్. బుధవారం మేనకోడలు వివాహం పెట్టుకుని ముందు రోజు విజయవాడకు జగన్ రావడాన్ని ఆ పార్టీ నేతలు, ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
బెంగళూరులోని లీలా ప్యాలెస్‌లో వైఎస్ షర్మిల కూతురు అంజలి రెడ్డి-రఘురామ్ రెడ్డి వివాహం బుధవారం అంగరంగ వైభవంగా జరగనుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. బంధువుల రాకతో బెంగుళూరు వివాహ వేదిక కళకళలాడుతోంది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, కుటుంబానికి చెందిన బంధువులు హాజరుకానున్నారు. సొంత మేనమామ జగన్ హాజరవుతారా? అన్నది అసలు ప్రశ్నలు.
ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమచారం మేరకు.. మేనకోడలు వివాహానికి దూరంగా ఉండాలని జగన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు రకాల వార్తలు వెలుగులోకి వచ్చాయి. కూతురి పెళ్లికి అన్న జగన్‌ను షర్మిల ఆహ్వానించలేదని అంటున్నారు. మరి కొందరైతే వివాహం ఓకే అయిన తర్వాత పెళ్లి వ్యవహారాలు దగ్గరుండి చూసుకోవాలని జగన్‌కు షర్మిల యలహంక ప్యాలెస్‌లోనే చెప్పిందని సమాచారం. ఈ రెండు వార్తల నడుము జగన్.. బుధవారం మేనకోడలు పెళ్లికి వెళ్తున్నారా? అన్నది క్వశ్చన్ మార్క్.
బెంగుళూరులోని లీలా ప్యాలెస్‌లో అంజలిరెడ్డి వివాహం జరగనుంది. అయితే మంగళవారం జగన్, తాడేపల్లికి చేరుకున్నారు. బుధవారం పార్టీ నేతలతో ఆయన బిజీగా గడపనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్‌లో షర్మిల.. అధికార పార్టీతో కుమ్మక్కు అయ్యిందని ఎదురుదాడి చేయాలని నేతలను అధినేత దిశానిర్దేశం చేయనున్నారట.
ALSO READ: అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం.. అదుపు తప్పి పలు వాహనాలను ఢీ కొట్టింది. విశాఖ సిటీలో ఘటన
జగన్ మేనకోడలు అంజిలిరెడ్డి వివాహం మొదలు నుంచి ఆ ఫ్యామిలీలో అంతర్గత వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తొలుత యలహంక ప్యాలెస్‌లో వివాహానికి నో చెప్పారు జగన్. అందుకు తగినట్టుగానే మరొక వేదికను ఏర్పాటు చేసుకున్నారు షర్మిల. యలహంక ప్యాలెస్ లీజుదారులతో పెళ్లికి మూడురోజుల ముందు షర్మిల అందులోకి అడుగుపెట్టకుండా న్యాయస్థానం ద్వారా ఆదేశాలు తెచ్చుకున్నారు.
కోర్టు ఆదేశాలతో పోలీసులు అడ్డుకోవడంతో వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఒక్కసారిగా షాకయ్యారు, కంటతడి పెట్టారు కూడా. తనను పెద్ద కూతురుగా భావించిన జగన్, ఈ విధంగా చేయడాన్ని తట్టుకోలేకపోయారు షర్మిల. వివాహానికి సంబంధించి సామాగ్రి ప్యాలెస్‌లోనే ఉండిపోయింది. వివాహం తర్వాత నెక్ట్స్ ఏం జరగబోతోంది? అన్నది అసలు ప్రశ్న. గతంలో జగన్ స్వయంగా చెల్లికి రాసిన ఇచ్చిన పత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరోవైపు జగన్ వ్యవహారశైలిని పార్టీలోని కొందరు నేతలు తప్పుబడుతున్నారు.