Visakha City: వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అని పదే పదే పోలీసులు చెబుతున్నా, ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రమాదాల కు గురవుతున్నాయి. అందులో శీతాకాలం కావడంతో ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాజాగా విశాఖ సిటీలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. అదుపు తప్పి పలు వాహనాల మీదకు దూసుకుపోయింది. ఈ ఘటనలో పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి. అసలు ఘటన ఎలా జరిగింది?
వైజాగ్ సిటీలో అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం చేసింది. ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యం జంక్షన్ వద్ద ఘటన చోటు చేసుకుంది. సత్యం జంక్షన్ నుంచి గురుద్వార్ వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. రాజోలు నుంచి విశాఖపట్నం వస్తోంది ఆర్టీసీ బస్సు. మార్గ మధ్యలో బస్సు అదుపు తప్పి పలు వాహనాలను ఢీ కొట్టింది. దీంతో పలు వాహనాలు డ్యామేజ్ అయ్యాయి.
ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. బస్సులో వున్న ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు ద్వారక ట్రాఫిక్ పోలీసులు. వెంటనే అంబులెన్సుల ద్వారా క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించారు. మరోవైపు విశాఖ సిటీలో ఉన్న హోంమంత్రి అనిత, ప్రమాద విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ALSO READ: నెల్లూరు రేణిగుంట ఆలయంపై.. కాక రేపుతున్న రాజకీయం
ప్రమాదం గురించి అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అందుతున్న వైద్య సహాయంపై ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీసులు, ఆర్టీసీ అధికారులు విచారణ చేపట్టారు. డ్రైవర్ నిద్రమత్తు కారణమా? వాహనానికి ఏమైనా సమస్య ఏర్పడిందా? అనేదానిపై విచారణ చేపట్టారు. ఆర్టీసీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. దాదాపు 20 మంది గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి.
విశాఖ:
అర్ధరాత్రి ఆర్టీసీ బస్సు బీభత్సం
సత్యం జంక్షన్ నుంచి గురుద్వార్ వెళ్లే మార్గంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పలు వాహనాలను ఢీ
బస్సు ఢీకొనడంతో ధ్వంసమైన పలు వాహనాలు
బస్సులో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలు pic.twitter.com/BKX37HgLGl
— Vizag News Man (@VizagNewsman) November 25, 2026