E-Paper
Advertisement

Chandrababu hot comments jagan govt: నంద్యాల షోలో బాబు, జగన్ కుటిల ప్రయత్నాలు, శవ రాజకీయాలు కూడా..

Chandrababu hot comments jagan govt: నంద్యాల షోలో బాబు, జగన్ కుటిల ప్రయత్నాలు, శవ రాజకీయాలు కూడా..
Advertisement

Chandrababu hot comments jagan govt: ఎన్నికల్లో గెలిచేందుకు అధికార వైసీపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు చంద్రబాబు. పొత్తుల్లో భాగంగా జనసేన 21 సీట్లలో పోటీ చేస్తుంటే .. మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లను ప్రొత్సహిస్తూ గాజు గ్లాసు గుర్తును కేటాయించేలా చేశారని దుయ్యబట్టారు. రానున్న ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదేనన్నారు చంద్రబాబు.

యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తామన్నారు చంద్రబాబు. యువత అంతా సైకిల్ ఎక్కాలని పిలుపు నిచ్చారు. జాబు రావాలంటే కూటమి ప్రభుత్వం రావాలన్నారు. తాను, పవన్ కల్యాణ్ వల్లే ఇదంతా సాధ్యమవుతుందన్నారు. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రెండో సంతకమన్నారు.

Advertisement

పెంఛన్లు వెయ్యి నుంచి మూడు వేలకు తాము పెంచామంటూ సీఎం జగన్ అబద్దాలు చెబుతున్నారని గుర్తు చేశారు టీడీపీ అధినేత. ఆయన ఓ శాపం ఉందని, నిజం చెబితే తల బద్దలై వేయి ముక్కలు అవుతుందన్నారు. వృద్దులను చంపి శవ రాజకీయాలు చేసే మనిషి జగన్ అని ఆరోపించారు. ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పుకొచ్చారు.  ఏప్రిల్ నుంచి నెలకు నాలుగు వేలు పింఛన్ ఇస్తామన్నారు. జులైలో బకాయిలతో కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తామన్నారు.

శనివారం నంద్యాలలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారాయ. వారసత్వం భూమిపై సైకో ఫోటో ఉండకూదన్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై ఓ పాటను వినిపించారు. బాధితుడు న్యాయవాదికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. భూచట్టం వల్ల అందరికీ ఉరితాడు వేశారని దుయ్యబట్టారు.

Advertisement

ALSO READ: భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి రాజశేఖర్ రెడ్డి పాదయాత్రే.. కడప బహిరంగసభలో రాహుల్

జగన్ మళ్లీ వస్తే మన భూములను అమ్ముకోవడానికి వీల్లేదన్నారు చంద్రబాబు. భూములపై అన్యాయం జరిగితే నేరుగా హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుందన్నారు. గతంలో ఉన్న పథకాలను మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి ఫారూఖ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు. పరిశ్రమలు తీసుకుని ఇక్కడి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు టీడీపీ అధినేత.

Related News

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Big Stories

Advertisement
×