Chandrababu Cabinet: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బీసీ వర్గాల చుట్టూనే తిరుగుతున్నాయి. బీసీలు రాజకీయంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. దీనిపై ఏపీ సర్కార్ కూడా దృష్టి పెట్టింది.
గురువారం అమరావతిలో సమావేశమైన చంద్రబాబు కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా పారిశ్రామిక వేత్తలను ఆదుకునేలా ప్రభుత్వ పాలసీల్లో మార్పులు చేసింది.
వాటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ పాలసీలో మార్పులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వర్గాల పారిశ్రామిక వేత్తలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా వర్గ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది ప్రభుత్వం. ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.