BigTV English

Ind vs Eng 1st ODI: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లండ్‌.. కోహ్లీ దూరం, ఇద్దరు అరంగేట్రం !

Ind vs Eng 1st ODI: బ్యాటింగ్‌ చేయనున్న ఇంగ్లండ్‌.. కోహ్లీ దూరం, ఇద్దరు అరంగేట్రం !

Ind vs Eng 1st ODI:  టీమ్ ఇండియా ( Team India ) వర్సెస్ ఇంగ్లాండ్ ( England ) మధ్య ఇవాల్టి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు టి20 ల సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ కూడా గెలవాలని… ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇవాళ నాగపూర్ విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో… టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్డే ప్రారంభం కానుంది.


Also Read: Marcus Stoinis Retirement: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్!

మధ్యాహ్నం 1.30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. అయితే.. ఇందులో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ మొదట బ్యాటింగ్‌ తీసుకోవాలని డిసైడ్‌ అయింది. దీంతో మొదట బౌలింగ్‌ చేయనుంది టీమిండియా. అయితే.. మొదటి వన్డే మ్యాచ్‌ కు విరాట్‌ కోహ్లీ ఆడటం లేదు. గత రాత్రి విరాట్‌ కోహ్లీకి మోకాలి సమస్య వచ్చింది. అందుకే మొదటి వన్డే మ్యాచ్‌ కు విరాట్‌ కోహ్లీ ( Virat Kohli ) దూరం అయ్యాడు. ఇదే విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ( Rohit Sharma ) కూడా నిర్ధారించారు.


ఇక టాస్‌ సమయంలో… టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ… వాస్తవంగా మేమే మొదట బౌలింగ్ చేయాలనుకున్నాము, దానికి తగ్గట్టుగానే…మాకు బౌలింగ్‌ అవకాశం వచ్చింది. మ్యాచ్‌ ఆరంభంలో బంతితో దూకుడుగా ఉంటుంది…ఆ తర్వాత మనమే అర్థం చేసుకుని బాగా రాణించాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌ లో జైస్వాల్ హర్షిత్ రాణా ఇద్దరూ వన్డే అరంగేట్రం చేస్తున్నారని తెలిపారు రోహిత్‌ శర్మ ( Rohit Sharma ). దురదృష్టవశాత్తు విరాట్  కోహ్లీ ( Virat Kohli ) ఆడటం లేదు, గత రాత్రి అతనికి మోకాలి సమస్య వచ్చిందని రోహిత్‌ శర్మ ప్రకటన చేశారు. దురదృష్టవశాత్తు విరాట్  కోహ్లీ ( Virat Kohli ) మొదటి మ్యాచ్‌ లో ఆడకపోవడం టీమిండియా పెద్ద షాక్‌ అని చెప్పాలి. ఇంగ్లండ్‌ పైన విరాట్  కోహ్లీ ( Virat Kohli ) మంచి రికార్డు ఉంది. అలాంటి ప్లేయర్‌ దూరం అవుతే.. టీమిండియా కష్టాలు తప్పవని అంటున్నారు. అటు విరాట్  కోహ్లీ ( Virat Kohli ) స్థానంలో… శ్రేయాస్ అయ్యర్ లేదా కేఎల్‌ రాహుల్‌ ఇద్దరిలో ఎవరో ఒకరు బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ ఉంటుంది.

 

Also Read: Sunrisers Hyderabad: కావ్యాపాప భారీ డీలింగ్‌.. ఈ సారి ఏకంగా రూ.1092 కోట్లు !

India vs England 1st ODI జట్ల అంచనా

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(w), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(c), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ

Related News

Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు

Vinod Kambli Networth: ఒకప్పుడు కోటీశ్వరుడు.. సచిన్‌తో సమానంగా టాలెంట్.. వినోద్ కాంబ్లి ఆస్తి ఎంతంటే..

Bumrah – Kapil Dev: ఆసీస్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌ !

Big Stories

×