Mahesh Babu : ఎమ్మెల్సీ ఓటర్ల లిస్ట్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఓటును తొలగించారన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ మహేష్ బాబు ఓటును ఎందుకు తొలగించారు? ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు ఏం జరిగింది? అనే వివరాల్లోకి వెళితే…
మహేష్ బాబు ఓటు తొలగింపు…
శాసన మండలి కృష్ణ – గుంటూరు పట్టభద్రుల ఓటర్ల జాబితాలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన ఓటర్స్ లిస్టులో సూపర్ స్టార్ ఘట్టమనేని మహేష్ బాబు (Mahesh Babu) పేరుతో ఉన్న ఓటును తొలగించారు. ఈ విషయాన్ని స్వయంగా గుంటూరు నగరపాలక సంస్థ అదరపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు మీడియాకు వెల్లడించారు. అయితే దీనికి కారణం మహేష్ బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదు అవ్వడమే అని తెలుస్తోంది.
బూత్ లెవెల్ విచారణ తర్వాత ఆ ఓటును తొలగించామని అదనపు కమిషనర్ వెల్లడించారు. గుంటూరు అర్బన్ లో నమోదైన దరఖాస్తులపై బూత్ లెవెల్ అధికారులతో విచారణ చేయించిన తర్వాతే, ఈ చర్య తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక ఈ ఓటు హక్కు కోసం ఎందరో గ్రాడ్యుయేట్లు అప్లై చేసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల టైమ్ లో అప్పుడప్పుడూ ఇలాంటి పొరపాట్లు జరగడం చూస్తూనే ఉంటాం మనం.
SSMB 29లో మహేష్ కోసం లేడీ విలన్
ఇదిలా ఉండగా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) బాబు దర్శక దిగ్గజం రాజమౌళి (Rajamouli)తో కలిసి ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB 29) అనే పాన్ వరల్డ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో మొదలుకాగా, ఫస్ట్ షెడ్యూల్ సైతం పూర్తయినట్టు టాక్ నడుస్తోంది. ఇక సెకండ్ షెడ్యూల్ ను ఫిబ్రవరి ఎండింగ్లో హైదరాబాద్లోనే షురూ చేయబోతున్నారని అంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు, ప్రియాంక చోప్రాపై హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సెకండ్ షెడ్యూల్ లో కూడా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహంలపై మరికొన్ని ముఖ్యమైన సీన్స్ ను షూట్ చేస్తారని సమాచారం.
ఈ నేపథ్యంలోనే (SSMB 29) మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్ కాదని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మూవీలో ఆమె మహేష్ బాబుకు విలన్ గా నటిస్తోందని అంటున్నారు. ఈ వార్తలపై ఇప్పటిదాకా రాజమౌళి స్పందించలేదు. ఆయన ఎలాంటి రూమర్స్ ని పట్టించుకోకుండా సైలెంట్ గా ఈ మూవీ షూటింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు.
మరోవైపు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ఫస్ట్ షెడ్యూల్ లో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుని ముంబైకి వెళ్ళిపోయింది. తన సోదరుడి పెళ్లి ఉండడంతో, ఫ్యామిలీతో అక్కడ పెళ్లి పనుల్లో మునిగిపోయింది. ఈ పెళ్లి పూర్తయ్యాక ప్రియాంక చోప్రా మళ్లీ ‘ఎస్ఎస్ఎంబి 29’ (SSMB 29) మూవీ కోసం హైదరాబాద్ లో అడుగు పెట్టే ఛాన్స్ ఉంది.