BigTV English

Chandrababu on Udayagiri: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

Chandrababu on Udayagiri: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

Chandrababu on Udaygiri:


Chandrababu on Udayagiri Kaliyugam issue : జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. కలియుగం అంశంపై జగన్ చేసిన కామెంట్స్‌పై కౌంటర్ ఇచ్చారు. గొడ్డలితో నరికిన వాడ్ని కాపాడుతూ బాధితులపై నేరం నెట్టివేయడం కలియుగం కాదా అంటూ ప్రశ్నించారు. చెల్లికి న్యాయం చేయకపోగా, ఆమెనే వేధించడం అదీ కలియుగం అని గుర్తుచేశారు.

అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే.. వాళ్లపైనే కేసులు పెట్టారు.. చివరకు హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అదీ కలియుగం. హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పేవాళ్లు అధికారంలో ఉండడమే కలియుగం.. అలాంటి సీఎం మనకు ఉండటం కలియుగం మహిమని వివరిం చారు. ప్రజాగళం రోడ్ షోలో భాగంగా శుక్రవారం రాత్రి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉదయగిరి రోడ్ షోలో ప్రసంగించారు చంద్రబాబు. ఈ క్రమంలో జగన్ పై విమర్శలు గుప్పించారు.


తనకు ఎవరూ లేరని.. ఒంటరివాడనని పదేపదే అబద్దాలు చెప్పడంపైనా కౌంటరిచ్చారు చంద్రబాబు. పేపర్, టీవీ అస్సలేమీ లేవని, ఆయనపై అందరూ దాడి చేస్తున్నామని చెప్పడం వెనుక ఏంటని మండిపడ్డారు. సునీత అడిగిన ఓ ప్రశ్న సీఎం జగన్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను వేటినీ మేనేజ్ చేయలేదని, రాబోయే రోజుల్లో నీ బతుకు భయంకరంగా తయారవుతుందన్నారు.

ALSO READ: పేదలంతా ఓ వైపు.. పెత్తందార్లు అంతా మరో వైపు.. సీఎం జగన్

అందరినీ అన్ని సమయాల్లో మోసం చేయలేవన్నారు చంద్రబాబు. తాను అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదని, కానీ చెల్లెలు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు.. మీ బాబాయ్‌ని ఎవరు చంపమన్నారో చెప్పి ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. జగన్ ఒక దోపిడీదారుడు.. విధ్వంస కారుడు.. రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా అంటూ ధ్వజమెత్తారు. ఈ విషయంలో అందరూ ఒక్కటవ్వాలా వద్దా అని ప్రజలను కోరారు. అందుకోసమే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.

Tags

Related News

Duvvada Srinivas: ఎమ్మెల్యే కూన రవికుమార్-సౌమ్య ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్, సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ

Aruna Arrest: పోలీసుల అదుపులో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ, ఉలిక్కిపడిన అధికారులు, నేతలు

Amaravati Crda office: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు

Bhogapuram Airport: వేగంగా భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు.. మహానాడుకు ముందే రాకపోకలు, బీచ్ కారిడార్‌పై ఫోకస్

New Bar Policy: గుడ్ న్యూస్..! ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుదారులకు భారీ తగ్గుంపు..

Tirumala News: తిరుమల కొండపైకి ఉచిత బస్సు ప్రయాణం.. మహిళల్లో ఆనందం, కాకపోతే

Big Stories

×