BigTV English

RCB vs KKR IPL 2024: ఆర్సీబీని ఓడించిన కోల్ కతా నైట్ రైడర్స్..

RCB vs KKR IPL 2024: ఆర్సీబీని ఓడించిన కోల్ కతా నైట్ రైడర్స్..

RCB vs KKR IPL 2024 Highlights


RCB vs KKR IPL 2024 Highlights(Latest sports news telugu): ఏ ముహుర్తాన ముంబై ఇండియన్స్ వర్సెస్ హైదరాబాద్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగిందో.. మిగిలిన మ్యాచ్ లపై కూడా ఆ ప్రభావం పడింది. అందరూ కూడా హైదరాబాద్ లా ఆడాలని, తుక్కు రేగ్గొట్టాలని చూస్తున్నారు.

శుక్రవారం జరిగిన బెంగళూరు వర్సెస్ కోల్ కతా మ్యాచ్ లో అదే జరిగింది. మొదట టాస్ ఓడి ఆర్బీసీ బ్యాటింగ్ కి దిగి 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మళ్లీ విరాట్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగుల చేసి నాటౌట్ గా నిలిచాడు.


183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ మొదటి బాల్ నుంచి ధనాధన్ ఆడటం మొదలుపెట్టింది. మహ్మద్ సిరాజ్ కి తొలి ఓవర్ లోనే భారీగా తగిలించారు. ఆ ఫ్లోటింగ్ అలా మ్యాచ్ ముగిసేవరకు నడుస్తూనే ఉంది. చివరికి 16.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసి విజయం సాధించారు.

మొదట బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీకి శుభారంభం దొరకలేదు. కెప్టెన్ డుప్లెసిస్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కొహ్లీ ఒక ఎండ్ లో నిలబడ్డాడు. తనకి  తోడుగా కామెరూన్ గ్రీన్ (21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), గ్లేన్ మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) సపోర్ట్ ఇచ్చారు.

చివర్లో దినేశ్ కార్తీక్ (8 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించాడు. పటీదార్ (3) మళ్లీ నిరాశ పరిచాడు. అర్జున్ రావత్ (3) షాట్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు.

Also Read: అందుకేనా నోటీసు… నెక్ట్స్ ఏంటి?

కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రూ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.

లక్ష్య ఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్స్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ఫిల్ శాల్ట్ 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అందులో 2 ఫోర్లు, 2 సిక్స్ లు కొట్టాడు. మరో ఓపెనర్ సునీల్ నరైన్ 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు. వీటిలో 5 సిక్స్ లు, 2 ఫోర్లు ఉన్నాయి.

తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. వాటిలో ఒక సిక్స్ అయితే బాల్ స్టేడియం అవతల పడిందేమోనని అనుకున్నారు. అంత ఎత్తు ఎళ్లింది. చివరల్లో శ్రేయాస్ అయ్యర్ 24 బంతుల్లో 39 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి రింకూ (5 నాటౌట్) సపోర్ట్ గా నిలిచాడు.

ఆర్బీసీ బౌలింగ్ లో యష్ దయాల్ 1, మయాంక్ 1, విజయ్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు.

దీంతో ఆర్సీబీ ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడి, ఒకదాంట్లో విజయం సాధించింది. కేకేఆర్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి ముందడుగు వేసింది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×