Big Stories

Indian Navy: మరో పడవ హైజాక్.. భారత నేవి డేరింగ్ ఆపరేషన్

Indian Navy latest news
Indian Navy

Indian Navy latest news(Telugu breaking news today): అరేబియా సముద్రంలో భారత నేవి డేరింగ్ ఆపరేషన్ చేపట్టింది. మరోసారి హైజాక్ కు గురైన నౌకను రక్షించేందుకు రంగంలోకి దిగింది. ఈ మేరకు భారత నేవి శుక్రవారం వెల్లడించింది. అరేబియా సముద్రంలో హైజాక్ కు గురైన ఓ ఇరాన్ నౌకను రక్షించే పని కోసం భారత్ సన్నద్ధమైనట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో 9 మంది సాయుధ పైరట్లు తమ ఆధీనంలోకి తీసుకున్న నౌకను రక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు వారు నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తమకు సమాచారం ఉందని పేర్కొంది.

- Advertisement -

ఇరన్ ఫిషింగ్ నౌక అల్ కమర్ 786ను పైరెట్లు ఆక్రమించినట్లు భారత నేవీకి సమాచారం అందింది. అయితే ఈ బోటు యెయెన్ కు చెందిన సోకోట్రా ద్వీపసముహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో చేపల బోటును సముద్ర దొంగలు తమ స్వాధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం ఉందని భారత్ తెలిపింది. సముద్ర దొంగల భరతం పట్టేందుకు ఆపరేషన్ చేపట్టింది.

- Advertisement -

Also Read: దేశమంతటా ఏఐ ఉండాలి.. బిల్ గేట్స్‌తో కలిసి టీ తాగుతూ ప్రధాని మోడీ కబుర్లు..

అయితే నౌకను హైజాక్ చేసిన వారిలో సిబ్బంది పాకిస్తానీయులు ఉన్నట్లు సమాచారం అందిందని స్పష్టం చేసింది. సొకోట్రాకు 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దీంతో భద్రత కార్యకలాపాల కోసం అరేబియా సముద్రంలో ఇప్పటికే ఉన్న రెండు భారత నౌకలను హైజాక్ అయిన బోటును రక్షించేందుకు ఆపరేషన్ చేపట్టింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతుందని.. త్వరలో బోటును సురక్షితంగా తమ ఆధీనంలోకి తీసుకువస్తామని స్పష్టం చేసింది.

సముద్ర, నేవికుల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు నేవీ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు రంగంలోకి యుద్ధ నౌకలు, స్పెషల్ ట్రైన్డ్ కమెండోలను దించినట్లు తెలిపింది. ఇక కొంత కాలంగా అరేబియా సముద్రాల్లో నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News