BigTV English

Chandrababu Fibernet Case | ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా

Chandrababu Fibernet Case | ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జనవరి 17 కి వాయిదా పడింది. ముందస్తు బెయిల్ పై విచారించిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. కీలక సూచనలు చేసింది. కేసుకు సంబంధించిన అంశాలపై ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ప్రభుత్వానికి,చంద్రబాబుకు సూచించింది. ఈ విషయంలో ఇరు వర్గాలు సంయమనం పాటించాలని ఆదేశించింది.

కేసు విషయాలపై బహిరంగంగా చంద్రబాబు నాయడు మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై ఆయన బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని న్యాయవాది సుప్రీం ధర్మాసనాన్ని కోరారు.

చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కూడా తన వాదనలు వినిపించారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. పైగా ప్రభుత్వం తరపునే ఢిల్లీ సహా పలు చోట్ల అదనపు ఏజీ, సీఐడీ డీజీ ప్రెస్ మీట్లు పెట్టి కేసు గురించి ప్రస్తావించారన్నారు. ఇలా మీడియా సమావేశాలు నిర్వహించడం పూర్తిగా తప్పు అని చెప్పారు.

ప్రెస్ మీట్లు పెట్టి ఆధారం లేకుండా ఆరోపణలు చేశారని.. కానీ చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చంద్రబాబు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం.. ఇద్దరినీ సంయమనం పాటించాలని కోరుతూ.. జనవరి 17కి విచారణ వాయిదా వేసింది.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×