E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ వారం ఓటీటీని షేక్ చేస్తున్న 5 క్రేజీ మలయాళం సినిమాలు, సిరీస్‌లు ఇవే… తెలుగులోనూ స్ట్రీమింగ్
Advertisement

Malayalam movies: మలయాళ సినిమాలు, సిరీస్‌ లకు తెలుగు ఓటీటీ ఆడియన్స్‌ లో క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. డిఫరెంట్ కథలు, సహజమైన పాత్రలు, కొత్త కాన్సెప్ట్స్‌తో వచ్చే మలయాళ కంటెంట్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఓటీటీల్లో అందుబాటులో ఉన్న ఐదు క్రేజీ మలయాళ కంటెంట్ ఏంటో చూద్దాం. మరి ఈ వారం ఓటీటీలోకి అడుగు పెట్టిన ఆ మలయాళం సినిమాలు ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అంటే…

1. వరువు (Varavu)

జోజు జార్జ్, షాజీ కైలాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘వరువు’ పవర్‌ఫుల్ యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్. కేరళ హై-రేంజ్ ప్రాంతాల్లోని భూమాఫియా, పాత కుటుంబ గొడవలు, బలమైన వర్గాల ఆధిపత్యం చుట్టూ కథ సాగుతుంది. చాలా ఏళ్ల తర్వాత సొంతూరికి తిరిగి వచ్చిన పాల్సన్… కుటుంబ సమస్యల్లో చిక్కుకోవడంతో అతని గతం కూడా బయటకు వస్తుంది. తన వాళ్లను కాపాడుకునేందుకు అతను చేసే పోరాటం సినిమాలో చూడాల్సిందే. జీ5 (ZEE5)లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

2. అచ్యుత అవతారం (Achyuta Avataaram)

Advertisement

గ్రామీణ నేపథ్యాన్ని సైబర్ క్రైమ్ ప్రపంచంతో ముడిపెట్టిన థ్రిల్లర్ ‘అచ్యుత అవతారం’. కాసరగోడ్‌లోని ఓ ప్రశాంతమైన గ్రామాన్ని అంతర్జాతీయ ఆన్‌లైన్ స్కామ్ నెట్‌వర్క్ టార్గెట్ చేస్తుంది. ఈ మోసాల వల్ల సర్వస్వం కోల్పోయిన యువతి… బాధితురాలిగా మిగిలిపోకుండా, ఆ నెట్‌వర్క్ వెనుక ఉన్న నేరస్థులను పట్టుకునేందుకు పోరాటం మొదలు పెడుతుంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్‌తోనూ చూడొచ్చు.

3. మహారాజా హాస్టల్ (Maharaja Hostel)

ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు సరదాగా హాస్టల్‌ లోకి అడుగు పెడితే… అక్కడ దెయ్యం కథ బయట పడుతుంది. వార్డెన్‌తో కలిసి వాళ్లు ఎదుర్కొనే వింత సంఘటనలు, పారానార్మల్ యాక్టివిటీస్ మధ్య కామెడీ, హారర్, మిస్టరీ కలిసిపోతాయి. ఆ హాస్టల్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి ? విద్యార్థులు దాన్ని ఎలా ఛేదించారు ? అనేదే ‘మహారాజా హాస్టల్’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), ఆహా వీడియో (aha Video) రెండు ఓటీటీల్లోనూ తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.

4. ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్ (Prince of Mollywood)

Advertisement

సినిమా స్టార్ కావాలనే కల ఉన్న ఫిరోజ్‌కు అతని తండ్రే పెద్ద అడ్డంకిగా మారితే ఎలా ఉంటుంది ? ఇదే కాన్సెప్ట్‌తో సాగే కామెడీ డ్రామా ‘ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్’. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్‌గా ఎదగడానికి ఫిరోజ్ చేసే ప్రయత్నాలు, అతని తండ్రితో జరిగే గొడవలు సిరీస్‌లో నవ్వులు పూయిస్తాయి. ఈ సిరీస్ జియోహాట్‌స్టార్ (JioHotstar)లో తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

5. తుడక్కమ్ (Thudakkam)

మోహన్‌లాల్, విస్మయ మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యారేజ్ డ్రామా ‘తుడక్కమ్’. కేరళ సంప్రదాయ వివాహ వేడుక నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య జరిగే భావోద్వేగాలు, గొడవలు, కొత్త బంధాల చుట్టూ కథ సాగుతుంది. సెప్టెంబర్ 18 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్‌కు రానుంది. తెలుగు ఆడియోతో చూసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే యాక్షన్ థ్రిల్లర్ నుంచి సైబర్ క్రైమ్, హారర్ కామెడీ, యూత్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వరకు… ఈ ఐదు కంటెంట్ తెలుగు ఓటీటీ ప్రేక్షకులకు డిఫరెంట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయి.

Read Also: హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

Tags

Related News

నెట్‌ఫ్లిక్స్ ప్రియులకు పండగ… ఒకే రోజు ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్… అన్నీ తెలుగులోనే

తేనె కోసం కొట్టుకుచచ్చే బిజినెస్ మ్యాన్లు… ఇలాంటి గ్యాంగ్‌స్టర్ డ్రామాను ఎక్కడా చూసుండరు

క్రష్ ని ఇంప్రెస్ చేయడానికి అబద్ధం… కట్ చేస్తే వరల్డ్ పాపులర్ చెఫ్

ప్రాంక్ కాస్తా క్రేజీ అడ్వెంచర్ గా మారితే… కడుపుబ్బా నవ్వించే కామెడీ డ్రామా

భార్య తప్పును తలపై వేసుకుని జైలుకు… హై-వోల్టేజ్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ధమాకా

అర్ధరాత్రి లాంగ్ డ్రైవ్‌… రాంగ్ టర్న్ తో డైరెక్ట్ గా నరకంలోకి… బోన్ చిల్లింగ్ ట్విస్టులు

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

Big Stories

Advertisement
×