Tirupati Greater: తిరుపతి గ్రేటర్ మున్సిపల్‌కు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తిరుపతి నగరపాలక సంస్థ పై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 50 నుంచి 66 డివిజన్లు పెంపునకు కూటమి ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఇక నుండి తిరుపతి నగరపాలక సంస్థలో 66 డివిజన్లుగా పేర్కోంది. గతంలో ఇప్పటివరకు ఉన్న 50 డివిజన్లు 66 కు పెంచుతూ కూటమి సర్కార్ ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో డివిజన్లు పునర్విభజనకు ప్రభుత్వం సెప్టెంబర్ 4న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డివిజన్లు పెంపుపై సెప్టెంబర్ 11 వరకు అభ్యంతరాల స్వీకరణ చేసారు. ప్రభుత్వానికి అందిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం పూర్తిచేసింది. డివిజన్లు విభజన ప్రతిపాదనలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు అధికారులు పంపించారు.
మున్సిపల్ శాఖకు ప్రతిపాదనల పంపిన తరువాత ప్రభుత్వం వాటిని నిషితంగా పనిశీలించి గతంలో ఉన్న 50 డివిజన్లను ప్రస్థుతానికి 66 డివిజన్లు పెంపునకు మంగళవారం సాయంత్రం కూటమి ప్రభుత్వ ఆమోదం తెలిపింది. దీంతో తిరుపతి కలిపి మోత్తం 66 డివిజన్లను సర్కార్ పెంచింది. దీంతో డివిజన్లు పునర్విభజనతో తిరుపతి నగర పాలనలో కీలక మార్పులు జరగనున్నాయి. ఈ విషయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం. జయకృష్ణ ప్రజలకు తెలియ చేశారు.
Also read: ట్రంప్ పర్యటనతో తలకిందులైన సమీకరణాలు.. యూకే ప్రభుత్వానికి డెడ్‌లైన్!