East Godavari: తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. విదుల్లో ఉన్న ఓ ఎస్ఐని కొంత మంది వ్యక్తుల దాడికి పాల్పడ్డారు. దీంతో ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. రెండు వర్గాల మద్య జరిగిన వివాధం చివరకు ఎకంగా ఎస్సైపై దాడి చేసే స్ధాయికి చేసేలా చేసారని జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.
తూర్పుగోదావరి జిల్లాలోని నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఆ సంఘటన చోటు చేసుకుంది. నల్లజర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులుపై కొంత మంది వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. డ్యూటీలో ఉన్న అధికారిని పోలీస్ స్టేషన్ ప్రాంగనంలో దాడి చేయడం అక్కడి ప్రాంత మంతా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నెల 7న నల్లజర్ల పోలీస్ స్టేషన్ బైట రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో వారిని సామరస్యంగా ఆపేదుకు డ్యూటీలో ఉన్న ఎస్ఐ ప్రయత్నించాడు. ఇరు వర్గాలకు చెప్పి శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గొడవ తీవ్రమవడంతో గొడుగు బాపూరావు అనే వ్యక్తి ఎస్ఐ ఆంజనేయుల కాలర్ పట్టుకుని, అతనితో పాటు మరికొందరు కలిసి ఎస్ఐని వెనక్కి నెట్టినట్టు అక్కడి అధికారులు తెలిపారు.
Also read: సీఎం రేవంత్‌తో వేవ్‌లెంగ్త్ మ్యాచ్ అయింది.. ! బీసీ మంత్రి భర్తరఫ్‌పై టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!
తనపై దాడి చేసేందుకు ప్రత్నించిన వారిపై ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ స్టేషన్‌లోనే బాధితుడిగా ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. దీంతో ఫిర్యాదు ఆధారంగా దాడి చేసిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షిచే అధికారులపై ఇలాంటి దాడులు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన కలకలం రేపింది. నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్టు అక్కడి పోలీస్ అధికారులు తెలిపారు.
Also read: 24 క్యారెట్ల బంగారు పూతతో.. గణపయ్యకు కుడుములు.. కేజీ ఏకంగా రూ.27,000 బాబోయ్!