E-Paper
Advertisement

ఇంట్లోనే క్రిస్పీ చికెన్ సమోసా ఎలా తయారు చేయాలి? సింపుల్ రెసిపీ ఇదిగో

ఇంట్లోనే క్రిస్పీ చికెన్ సమోసా ఎలా తయారు చేయాలి? సింపుల్ రెసిపీ ఇదిగో
Advertisement

Crispy Chicken Samosa| వర్షాకాలం, చలికాలంలో సాయంత్రం వేళ వేడివేడిగా క్రిస్పీ సమోసా తినాలని చాలామందికి అనిపిస్తుంది.
అయితే ప్రతిసారీ ఆలూ సమోసానే ఎందుకు తినాలి? చికెన్ ఇష్టపడేవారు ఇంట్లోనే రుచికరమైన చికెన్ సమోసా సులభంగా తయారు చేసుకోవచ్చు. బయట హెటల్‌లో లభించే  క్రిస్పీగా, లోపల మసాలా చికెన్ ఫిల్లింగ్‌తో ఈ స్నాక్‌ను తయారు చేయవచ్చు. పిండిని సిద్ధం చేయడం నుంచి సమోసాలను వేయించడం వరకు కొన్ని సింపుల్ స్టెప్స్ పాటిస్తే సరిపోతుంది.

చికెన్ సమోసా కోసం కావాల్సిన పదార్థాలు ఇవే

½ కిలో మైదా
½ కిలో బోన్‌లెస్ చికెన్
1 ప్యాకెట్ మ్యాగీ మసాలా
1 మీడియం సైజ్ ఉల్లిపాయ
1 టీస్పూన్ ఉప్పు
½ టీస్పూన్ కారం
1 టీస్పూన్ ధనియాల పొడి
½ టీస్పూన్ గరం మసాలా
½ టీస్పూన్
వేయించడానికి సరిపడా నూనె

ముందుగా సమోసా పిండిని సిద్ధం చేసుకోవాలి

Advertisement

ఒక పెద్ద గిన్నెలో మైదాను తీసుకోవాలి. అందులో ఉప్పు, వాము వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దికొద్దిగా నీటిని పోస్తూ గట్టిగా, మెత్తగా ఉండేలా పిండిని కలపాలి. పిండిని మూతపెట్టి సుమారు 20 నిమిషాలు పక్కన ఉంచాలి. ఇలా కాసేపు పక్కన పెట్టిన పిండిని తర్వాత సులభంగా చపాతీలా ప్రెస్ చేసుకోవాలి.

ఇప్పుడు చికెన్‌ ఉడికించుకోవాలి

బోన్‌లెస్ చికెన్‌ని ముందుగా శుభ్రంగా కడగాలి. ప్రెజర్ కుక్కర్‌లో చికెన్‌ వేసి అర టీస్పూన్ ఉప్పు కలపాలి. చికెన్‌ను రెండు నుంచి మూడు సీటీలు వచ్చే వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత చికెన్‌ను కొద్దిగా చల్లారనివ్వాలి. తర్వాత చికెన్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి లేదా ష్రెడ్ చేయాలి.

మసాలా చికెన్ ఫిల్లింగ్‌ను ఇలా తయారు చేయాలి

Advertisement

స్టవ్‌పై పాన్ పెట్టి నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయను అందులో వేయాలి. ఉల్లిపాయను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి.
తర్వాత ఉడికించిన చికెన్ ముక్కలను పాన్‌లో వేసుకోవాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మ్యాగీ మసాలా కూడా వేసి చికెన్‌తో బాగా కలిసేలా వేయించాలి.
మసాలా చికెన్‌ను కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
సమోసాల్లో పెట్టే ముందు ఫిల్లింగ్ పూర్తిగా చల్లారనివ్వాలి.

సమోసాలకు సరైన ఆకారం ఇవ్వాలి

ఇప్పటికే సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
ప్రతి ఉండను పలుచగా ప్రెస్ చేసుకోండి. అవసరమైతే ఒత్తిన పిండిని సరైన పరిమాణంలో ముక్కలుగా కట్ చేసుకోవచ్చు.
ప్రతి ముక్కలో కొద్దిగా చికెన్ ఫిల్లింగ్ పెట్టాలి.
పిండిని జాగ్రత్తగా మడిచి సమోసా ఆకారం ఇవ్వాలి.
ఫిల్లింగ్ బయటకు రాకుండా అంచులను బాగా సీల్ చేయాలి.
ఇదే విధంగా మిగిలిన పిండి, ఫిల్లింగ్‌తో అన్ని సమోసాలను సిద్ధం చేయాలి.

Also Read: మధ్యాహ్నం 3 గంటల తర్వాత నీరసంగా అనిపిస్తోందా? రోజంతా ఫుల్ ఎనర్జీ కోసం సింపుల్ టిప్స్

సమోసాలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి

లోతైన పాన్‌లో సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడి చేయాలి.
నూనె వేడయ్యాక సమోసాలను జాగ్రత్తగా అందులో వేయాలి.
పాన్‌లో ఒకేసారి ఎక్కువ సమోసాలు వేయకూడదు.
సమోసాలను మధ్యమధ్యలో తిప్పుతూ సమానంగా వేయించాలి.
అవి బంగారు రంగులోకి మారి క్రిస్పీగా కనిపించినప్పుడు బయటకు తీయాలి.
అదనపు నూనె తొలగిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేయాలి.

వేడివేడిగా చికెన్ సమోసాలను ఆస్వాదించండి

క్రిస్పీ చికెన్ సమోసాలను మీకు ఇష్టమైన చట్నీతో కలిపి తింటే మరింత రుచికరంగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల మసాలా చికెన్ ఫిల్లింగ్‌తో ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. సాయంత్రం స్నాక్‌గా లేదా కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి ఇవి మంచి ఎంపిక.

Also Read: ఫుడ్ పాయిజనింగ్‌ అంటే కేవలం వాంతులు, విరేచనాలు కాదు.. నరాలు, కిడ్నీలు, కీళ్లకు ప్రమాదం.. ఎలాగంటే

Related News

ప్రెజర్ కుకర్ లేకుండా పప్పు త్వరగా మెత్తగా ఎలా ఉడికించాలి? ఈజీ కిచెన్ టిప్స్ మీకోసం

ఏ మతానికి దయా గుణం ఎక్కువ? బిచ్చగాడి ఐడియా అదుర్స్.. గెలుపు ఎవరిదంటే?

సినిమాల్లో బోల్డ్ సీన్లు ఎలా షూట్ చేస్తారు? కెమెరా వెనుక జరిగేది ఇదే

ఫోన్ చోరీ అయిందా? మీ బ్యాంక్ ఖాతాను కాపాడేందుకు వెంటనే ఈ 5 పనులు చేయండి

మోసం చేసిన వారిని ఎప్పటికీ క్షమించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు తప్పు చేస్తే రెండో ఛాన్స్ ఇవ్వరు

చాటింగ్‌లో మనసును తాకే మాటలు, కవిత్వాలు.. నిజజీవితంలో మాత్రం బోర్.. ఎందుకలా?

జిమ్‌కు వెళ్లకుండానే ఫిట్‌గా ఉండాలా? ఈ సింపుల్ వాకింగ్ టెక్నిక్స్ చేస్తే సరి

Big Stories

Advertisement
×