E-Paper
Advertisement

Big Offer: నూతనంగా రెస్టారెంట్ ప్రారంభం.. కేవలం రూ. 2 లకే బిర్యానీ.. ఎక్కడంటే?

Big Offer: నూతనంగా రెస్టారెంట్ ప్రారంభం.. కేవలం రూ. 2 లకే బిర్యానీ.. ఎక్కడంటే?
Advertisement

Biryani Offer: బిర్యానీ ధర వచ్చేసి దాదాపుగా రూ. 100 నుంచి ఆ పైన ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ లో లేదా ఇతర కార్యక్రమాల్లోనూ ఫ్రీగా బిర్యానీ పెడుతుంటారు. కొంతమంది హోటల్ నిర్వాహకులు పలు ఆఫర్లు పెడుతుంటారు. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ ఆఫర్లు పెడుతుంటారు. లేదా పండుగ సందర్భంగానో, అప్పుడున్నటువంటి స్పెషల్ అకేషన్ ను బట్టో అలా ఆఫర్లు పెడుతుంటారు. అయితే, ఒకతను మాత్రం చాలా తక్కువ రేటుకే బిర్యానీని ఆఫర్ పెట్టాడు. అది చాలా తక్కువ అంటే తక్కువ రేటుకే బిర్యానీని విక్రయించాడు. దీంతో జనం భారీగా ఎగబడి ఆ బిర్యానీ ప్యాకెట్లను కొన్నారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ జనాన్ని పోలీసులు అదుపు చేయలేక తంటాలు పడ్డారు. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల్లో వచ్చిన ప్రకారం..

Also Read: ఏపీ వాసులకు భారీ శుభవార్త.. ఇకనుంచి ఫటాఫట్ పరిష్కారం కానున్న సమస్యలు

Advertisement

ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా తేడాపల్లిగూడంలో ఉన్న ఉషా గ్రాండ్ వద్ద నూతనంగా ఓ రెస్టారెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ రెస్టారెంట్ వారు కేవలం రూ. 2 లకే చికెన్ బిర్యానీ అని ప్రకటించారు. దీంతో జనం అక్కడికి పోటెత్తారు. సుమారుగా 2 వేలకు మందికి పైగా ఎగబడ్డారు. కానీ, నిర్వాహకులు మాత్రం ఆఫర్ కింద కేవలం 200 ప్యాకెట్లు మాత్రమే విక్రయించారు. దీంతో ఆ రెస్టారెంట్ వద్ద కొద్దిసేపు తొక్కిసలాట జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ ను అదుపు చేశారు. అయితే, రూ. 2 లకే బిర్యానీ అని చెప్పి కేవలం 200 మందికి మాత్రమే ఇవ్వడంతో మిగిలినవారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×