BigTV English

Tata Nexon Car: సేఫ్టీలో నెక్సాన్ నెక్స్ట్ లెవెల్.. ధర కూడా తక్కువే.. ఏకంగా అంతమంది పోవచ్చా..!

Tata Nexon Car: సేఫ్టీలో నెక్సాన్ నెక్స్ట్ లెవెల్.. ధర కూడా తక్కువే.. ఏకంగా అంతమంది పోవచ్చా..!

Tata nexon car sales july 2024: ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని నెలవారి రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి. గత నెల సేల్స్ రిపోర్ట్స్ ఇప్పటికే విడుదలయ్యాయి. అందులో టాప్ 10 కార్ల లిస్ట్‌లో హ్యుందాయ్ క్రెటా ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత మారుతి, టాటా కార్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే ఇదే లిస్ట్‌లో టాటా నెక్సాన్ 7వ స్థానం కైవసం చేసుకుంది. ఈ కారు ధర, సేఫ్టీ ఫీచర్ల విషయంలో మంచి ప్రజాదరణ పొందింది. ఇప్పుడు దీనికి ఈ టాటా నెక్సాన్ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.


దేశీయ మార్కెట్‌లో టాటా నెక్సాన్ అంటే ఓ రేంజ్. లుక్, డిజైన్, ఫీచర్లు, ధర ఇలా ఏ విషయంలో చూసుకున్నా బెస్ట్‌గానే ఉంటుంది. గత నెలలో ఈ కారు మంచి నెంబర్‌ను సేల్స్‌లో నమోదు చేసింది. జులై 2024లో ఫ్యూయల్, ఎలక్ట్రిక్ నెక్సాన్ కలిపి 13,902 యూనిట్ల కార్లు సేల్ అయ్యాయి. అయితే 2023 జులైలో 12,349 యూనిట్ల కార్లు మాత్రమే అమ్మకం జరిగాయి. దీనిబట్టి చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది జులైలో నెక్సాన్ సేల్స్ 12.58 శాతం వృద్ధిని నమోదు చేశాయి. ఇక ఈ కారు ధర విషయానికొస్తే.. రూ.8 లక్షల నుంచి రూ.15.80 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య అందుబాటులో ఉంది.

Also Read: జూలైలో ఎక్కువగా అమ్ముడైన కార్లు ఇవే.. టాప్ 10 లిస్ట్‌లో ఫస్ట్‌ ప్లేస్ దీనికే..!


ఈ నెక్సాన్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇది 5, 6 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కాగా త్వరలో ఈ నెక్సాన్‌ను సీఎన్‌జీ వెర్షన్‌లోనూ తీసుకురానున్నారు. కాగా నెక్సాన్ కారులో మొత్తం 5 మంది ప్రయాణికులు చాలా హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఇందులో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.

అలాగే సేఫ్టీ విషయంలోనూ నెక్సాన్ తగ్గలేదు. ఏకంగా 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఏస్ బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడి, ఈఎస్పీ వంటి సేఫ్టీ ఫీచర్లతో వచ్చింది. ఇక నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 30 కెడబ్లూహెచ్, 40.5 కెడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్‌లో వస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌పై 465 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో మొత్తం 10 వేరియంట్లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు బిఎన్సిఏపీ క్రాస్ టెస్టింగ్‌లో 5 స్టార్ రేటింగ్‌ని అందుకుంది. ఇందులో కూడా 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఈఎస్సి సహా మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.14.49 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉంటుంది.

Related News

Gold: ఈ దేశాల్లో టన్నులకొద్ది బంగారం.. మన దేశం ఏ స్థానంలో ఉందంటే?

Recharge offer: విఐ బిజినెస్ నుండి మెగా మాన్సూన్ ఆఫర్.. 449 రూపాయల ప్లాన్ ఇప్పుడు 349కే

BSNL recharge offer: రూ.61కే ఓటీటీ, లైవ్ ఛానెల్.. ఇంకా ఎన్నో, BSNL బిగ్ ప్లాన్!

FD In Bank: బ్యాంకులో FD చేయాలనుకుంటున్నారా? ఈ 3 మిస్టేక్స్ అస్సలు చేయకండి!

Jio Prepaid Plans: వామ్మో .. ఏమిటి, జియో ఇన్ని రిచార్జ్ ప్లాన్స్ తొలగించిందా?

Foreclosing Loan: బ్యాంక్ లోన్ ఫోర్ క్లోజ్ చేయడం మంచిదా? కాదా? మన క్రెడిట్ స్కోర్ పై దీని ప్రభావం ఉంటుందా?

Jio Recharge Offers: జియో బంపర్ ఆఫర్.. రీచార్జ్ చేసుకుంటే వెంటనే క్యాష్‌బ్యాక్!

BSNL Sim Post Office: పోస్టాఫీసులో BSNL సిమ్.. ఇక గ్రామాలకూ విస్తరించనున్న సేవలు

Big Stories

×