E-Paper
Advertisement

Congress Leader Sajjan Singh: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

Congress Leader Sajjan Singh: హసీనాకు పట్టిన గతే మోదీకి.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
Advertisement

Congress Leader Sajjan Singh: మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లర్లతో ధ్వంసమైన బంగ్లాదేశ్‌లాగా భారత ప్రజలు కూడా ఏదో ఓ రోజు ప్రధాని మోదీ అధికారిక నివాసాన్ని ముట్టడిస్తారని అన్నారు. సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సజ్జన్ సింగ్‌పై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ యువజన విభాగం డిమాండ్ చేస్తోంది. ఇండోర్‌లో జరిగిన ఓ సమావేశంలో సజ్జన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సమావేశంలో సజ్జన్ సింగ్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో అల్లర్ల సమయంలో ప్రజలు ప్రధాని షేక్ హసీనా అధికారిక భవనంలోకి ప్రవేశించారని అన్నారు. ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అలాంటి పరిస్థితి వచ్చిందని తెలిపారు. మోదీ గుర్తుంచుకోండి. మీ తప్పుడు విధానాల వల్ల కూడా ఏదో ఒక రోజు ప్రజలు మీ నివాసంలోకి ప్రవేశించి ఆక్రమించుకుంటారు. ఇదే ఇటీవల శ్రీలంకలో కూడా జరిగింది. శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి కూడా ఆందోళన కారులు ప్రవేశించారు.

Advertisement

Also Read: ఆ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగానే.. భగ్గమన్న విపక్షాలు.. సభలో గందరగోళం

తాజాగా బంగ్లాదేశ్‌లో కూడా ఇదే జరిగింది. ప్రస్తుతం భారత్ వంతు అని సజ్జన్ సింగ్ అన్నారు. ఇదిలా ఉంటే సజ్జన్ సింగ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయుల మనో భావాలు దెబ్బతిసేలా సజ్జన్ సింగ్ మాట్లాడటంతో పాటు.. దేశ వ్యతిరేక పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపించారు.

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×